చాట్రాయి మండలంలో పలు ప్రారంభోత్సవాలు
ఈవీ శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో పలు గ్రామాలలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన వివిధ భవనాలకు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రారంభోత్సవాలు చేశారు. శనివారం చాట్రాయి మండలంలోని చనుబండ చాట్రాయి పోలవరం మర్లపాలెం కొత్తగూడెం తదితర గ్రామాలలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన నూతన భవనాలు సిసి రోడ్లు కొత్త పనులు ప్రారంభించారు. పోలవరం లో నాలుగు కోట్ల 30 లక్షలతో మండలంలో అతిపెద్ద గ్రామాల్లో ఒకటైన పోలవరంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు.సహకార సంఘంలో అభివృద్ధి చేసిన భవనాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు ఎడవల్లి రోడ్డుకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. చాట్రాయిలో సిసి రోడ్డు ప్రారంభించారు. చనుబండ లో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ వెల్ నెస్ సెంటర్ సిసి రోడ్ ప్రారంభించారు. ఈ విధంగా పలు కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, కేడీసీసీ చైర్మన్ పద్మావతి, ఏపీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి, ఎంపీపీ లంక నిర్మల, జడ్పిటిసి చెలికాని అనూష శ్రీరాం, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు మిద్దె బాలకృష్ణ, చనుబండ సర్పంచ్ విస్సంపల్లి జ్యోతి, వైసిపి మండల నాయకులు దామెర ప్రసాద్ బాబు, చెలికాని బాబ్జి, పోలవరం సర్పంచ్ సత్తెనపల్లి లక్ష్మీ, కొత్తగూడెం సర్పంచ్ చల్లగుళ్ళ వెంకటేశ్వరరావు, చిత్తపూరు సర్పంచ్ తిరువీధి రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు పాల్గొన్నారు. (Story: చాట్రాయి మండలంలో పలు ప్రారంభోత్సవాలు)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!