ఎక్కడ నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రతి నెల ఒకటవవ తేదీ నుంచి పడియేనువ తేదీ వరకు, తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుండైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలో గల శ్యామలంబ కన్జ్యూమర్ స్టోర్ సూపర్ మార్కెట్ 2 లో ఆమె పేదలకు బియ్యంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయడానికోసం ఎం డి యు వాహనాల పథకం తీసుకువచ్చారు. కానీ ఇది సరైన రీతిలో పనిచేయలేదని అన్నారు. వాహనాలు నెలలో కొద్దిరోజులే తిరిగాయని. ఒకే చోట నిలిపి సరుకులు ఇచ్చారు దీనివలన. వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారికి చాలా ఇబ్బంది అయ్యేది అని అన్నారు.ఈ పరిస్థితిని పరిశీలించిన కూటమి ప్రభుత్వం — పౌరుల సౌకర్యం కోసం — మళ్లీ పాత విధానాన్ని ప్రారంభించిందని తెలిపారు.అంటే ఇప్పుడు ప్రతి కుటుంబం తాము నచ్చిన సమయానికి, తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుండైనా రేషన్ తీసుకువచ్చిన అన్నారు.65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంట్లోనే రేషన్ సరుకులు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని ఆమె తెలియజేశారు.రేషన్ షాపుల్లో రాబోయే రోజుల్లో ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. దీనివల్ల డీలర్ల ఆదాయం పెరిగి వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలియజేశారు.ఎం డి యు వాహనాలపై ఉన్న లోన్లు ప్రభుత్వమే చెల్లించి, ఆ వాహనాలను లబ్దిదారులకు ముందుగానే ఇచ్చేస్తున్నామని అన్నారు. వాళ్లు వాటిని తమ ఉపాధి కోసం ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు.ఈ మార్పులు ప్రజలకోసం, వారి సౌకర్యం కోసమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమణ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు,. మాజీ కౌన్సిలర్ మజ్జి చిరంజీవి రావు, మాజీ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్, పప్పలు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.(Story : ఎక్కడ నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు )

