UA-35385725-1 UA-35385725-1

ఎం.ఎల్.సి ఎన్నికలో మనదే విజయం

ఎం.ఎల్.సి ఎన్నికలో మనదే విజయం

కాంగ్రెస్ పార్టీవి ఆరు గ్యారెంటీలు కావు 420 హామీలు

వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి మండల బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం అధ్యక్షులు మాణిక్యం అధ్యక్షతన జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ కె.సి.అర్ తెచ్చిన తెలంగాణ లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిలేని హామీలు రైతు ఋణ మాఫీ,రైతు బంధు,ధాన్యం కొనుగోలు బోనస్ 500ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తిసిందని అని ఇట్టి విషయం ప్రజలకు స్పష్టం చేయాలని అన్నారు. సాగునీరు కె .సి. ఆర్ పొదుపుగా వాడి రైతులకు ఏప్రిల్ వరకు అందించామని నేడు కాంగ్రెస్ గెలిచిన మరుసటి రోజున కెనాల్స్ ఎండిపోయి రైతులను ఇబ్బంది పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. పార్టీలో మిగిలిన నాయకులు నికార్సైన వారు ఉన్నారని మీ మీద నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని అంతే విశ్వాసముతో కసిగా పని చేసి పార్లమెంట్, ఎం.ఎల్.సి ఎన్నికలో విజయం సాధించాలని అన్నారు.
కష్టకాలంలో నాతో కలసి ఉన్నవాళ్లకు అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ కొత్తగా పనులు చేస్తుందని నమ్మకం లేదని మన హయాములో మంజూరు ఇచ్చిన పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయాలని దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది అని ఈ రెండునెలలు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశములో మాణిక్యం,జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పి. రమేశ్ గౌడ్, సీనియర్ నాయకులు బి.లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్, జి.రాములు యాదవ్,చెన్న రాములు, కోళ్ల.వెంకటేష్, చంద్రశేఖర్ నాయక్, మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్, ఎం.పి.టి. సి లు రంగారెడ్డి, ధర్మానాయక్, ధర్మ శాస్త్రి, శ్రీనివాసులు,రాజేశ్వరి, భానుప్రకాష్, రఘువర్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, విష్ణు యాదవ్, కడుకుంట్ల.బాలకృష్ణ,దెవర్ల.నరసింహ, దేవేందర్ నాయుడు, కస్నా నాయక్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు. (Story: ఎం.ఎల్.సి ఎన్నికలో మనదే విజయం)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1