తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్
వనపర్తి (న్యూస్ తెలుగు) : గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలను సరిద్దిద్దుకొనీ రాబోవు స్థానిక సంస్థల ఎం.ఎల్.సి,పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ సమావేశములో అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. దళిత బహజనులు అభివృద్ధి కోసం బి. యస్.పితో పొత్తు పెట్టుకోవడం జరిగిందని.ఈ రెండు నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజలలో నిత్యం కలసి ఉండాలని అన్నారు. రెండు జాతీయ పార్టీలు బి.అర్. యస్ పార్టీని టార్గెట్ చేసుకొని చీకటి ఓప్పందాలు చేసుకున్నాయని తెలంగాణ ప్రయోజనాలు కోసం కె.సి.అర్ నాయకత్వం నిలుపుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. నాయకుల కార్యకర్తల పనితీరుపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని మీరు కూడా అంతే విశ్వాసముతో పని చేసి మన నియోజకవర్గంలో మెజారిటీ సాధించాలని అన్నారు. పట్టణ పార్టీ సమావేశములో ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. (Story: తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!