వరి ధాన్యం అక్రమాలపై సమగ్ర విచారణ
సిపిఐ డిమాండ్
వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి జిల్లాలో రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ వరి ధాన్యం అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు డిమాండ్ చేశారు. శనివారం వరి ధాన్యం అక్రమాలపై వనపర్తి అంబేద్కర్ అక్రమాలకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ సంచి త్ గంగ్వార్ కు వినతి పత్రం అందజేశారు. ఆయన కలెక్టర్ కు వినతిని పంపుతామన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి, నేతలు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరించి, బియ్యం తయారుచేసి ఇవ్వాలని మిల్లులకు సివిల్ సప్లై శాఖ ధాన్యం అప్పగించిందని, బియ్యం పెట్టాల్సిన గడువు ఎప్పుడో ముగిసిన ఇప్పటికీ పెట్టలేదన్నారు. జనవరి 31వ తేదీ వరకు బియ్యం పెట్టాలని రైస్ మిల్లర్లను ఆదేశించినా బే ఖాతారు చేశారన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ మళ్లీ ఫిబ్రవరి 20వ తేదీకి గడువు పొడిగించారని,అయినా పూర్తిస్థాయిలో బియ్యం పెట్టలేదన్నారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం బియ్యం చేసి వ్యాపారం చేయటమే కారణమని ఆరోపించారు. ఇటీవల చిన్నంబాయి మండలం పెద్ద దగడ లో వనపర్తి మండలం నాచపల్లికి చెందిన ఒక మిల్లర్ లక్ష 15 వేల బస్తాలు నిలువ చేశారన్నారు. పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన హమాలీల ద్వారా రాత్రిపూట పెద్ద దగడలోని గోదాం నుంచి ధాన్యం తీసుకు వెళుతుండగా పట్టుకున్నారన్నారు. ఇందులో 13 మందిపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేశారని, అక్రమాలకుఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు వారు పెట్టిన బియ్యం, మిల్లులో ఉన్న ధాన్యం స్టాక్ లెక్కలను పరిశీలించి, మిల్లర్లను వారికి అండగా నిలుస్తున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. పి. కళావతమ్మ, శ్రీహరి, గోపాలకృష్ణ, రాబర్ట్, రమేష్, రాజనగరం కృష్ణయ్య, నరేష్, కుతుబ్, చంద్రశేఖర్, మహేష్, బాలకృష్ణ, కురువ రాముడు తదితరులు పాల్గొన్నారు. (Story: వరి ధాన్యం అక్రమాలపై సమగ్ర విచారణ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!