సెల్ఫ్ డిఫెన్స్‌పై వారం రోజుల శిక్షణా కార్యక్రమం
తిరుపతి (న్యూస్ తెలుగు) : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్ర అసోసియేట్ ప్రొఫెసర్.డాక్టర్. డి. ఉమాదేవి ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ అనే అంశం పైన ఒక వారం రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులకు 26.2.2024వ తేదీ నుండి 02-3-2024వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్. కె.అనురాధ, సోషల్ సైన్స్ డీన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, ఈ క్రమంలో మహిళలపై వేధింపులు, దాడులు కూడా పెరుగుతున్నాయని, ఆపద సమయంలో సహాయం కోసం ఎదురు చూడటం కంటే తమని తాము రక్షించుకునే ఆత్మరక్షణ విద్యల్లో మెలకువలను నేర్చుకోవడంలో శిక్షణ తప్పక తీసుకోవాలని లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించినప్పుడే విజయం సాధ్యమవుతుందని తెలిపారు. మహిళ అధ్యయన కేంద్ర, విభాగ హెడ్ ఇంచార్జ్ డాక్టర్.పి.నీరజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం సాధించడం మరింత సులభతరం అవుతుందన్నారు. ఆపద సమయంలో భయపడకుండా చిన్నపాటి టెక్నిక్‌లను ఉపయోగించి ప్రత్యర్థులను నేల కూల్చే మార్షల్ ఆర్ట్స్ విద్య అమ్మాయిలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని, ఈ వారం రోజుల శిక్షణ సమయాన్ని క్రమశిక్షణతో నేర్చుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. డాక్టర్. డి.ఉమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక బాలిక మహిళ స్వీయ రక్షణ చిట్కాలను నేర్చుకుని తీరాలని, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కి మహిళలకు సాధారణ ఫిట్ నెస్ చాలు అని, ఈ ప్రాక్టీస్ లో దేహం శక్తివంతమవుతూ, ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని తెలిపారు. ప్రమాదం ఎదురైతే స్పందించాల్సిన మెదడు ఈ ప్రాక్టీస్ వల్ల చురుగ్గా ఉంటుందని, దాంతో తక్షణమే అప్రమత్తమై మెలకువలతో వేగంగా స్పందిస్తుందని ఆత్మరక్షణ విద్యల సహాయంతో ఆపద నుండి బయటపడ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షకులుగా ధనుంజయలు విచ్చేసి విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండుటకు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పరిశీలన తదితర అంశాల పైన పూర్తి అవగాహన కల్పించి ఆత్మరక్షణ సాధనంగా మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిపారు. స్వీయ రక్షణ చిట్కాలను విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమానికి మహిళా అధ్యయన కేంద్ర రీసెర్చ్ అసిస్టెంట్ డాక్టర్ ఎం.ఇంద్రాణి సహకరించారు. (Story: సెల్ఫ్ డిఫెన్స్‌పై వారం రోజుల శిక్షణా కార్యక్రమం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!