UA-35385725-1 UA-35385725-1

జగనన్నఆశయ సాధనకై చ‌ద‌వండి

జగనన్నఆశయ సాధనకై చ‌ద‌వండి

విద్యార్థుల‌కు స్టేష‌న‌రీ పంపిణీ చేసిన సిరి స‌హ‌స్ర‌

రాజాం (న్యూస్ తెలుగు) : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాల‌ని విద్యార్థుల‌కు సిరి స‌హ‌స్ర కోరారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం మండలంలోని కంచరాం, డోలపేట, పొగిరి గ్రామాలలోని జెడ్.పి.హెచ్.స్కూల్స్ 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి. రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) విద్యార్దులకు పరీక్ష వ్రాయుటకు స్టేషనరీని మంగళవారం నాడు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభి వృద్ధి కోసం జగనన్న ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలలో వేలాది కోట్లు రూపాయలు ఖర్చు చేసిందన్నారు. నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠ‌శాలలు కార్పోరేట్ స్థాయికి ఎదిగాయని ఆమె కొనియాడారు. ఆంగ్ల మాధ్యమాన్ని విద్యార్ధుల చెంతకు చేర్చిన ఘనత జగనన్నకు దక్కిందని సిరి సహస్ర ప్రశంసించారు. జగనన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాగా చదువు కోవలసిన అవసరం ఉందన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణతో చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్దుల చేతుల్లోనే దేశ అభివృద్ధి ఉంటుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌక‌ర్యాలను ప్రతీ ఒక్కరూ వినియోగించుకొని మంచి ఫలితాలను సాధించాలన్నారు. జాతీయస్థాయిలో విజయనగరం కీర్తిన ప‌తాకాన్ని రెపరెపలాడించాలన్నారు. (Story: జగనన్నఆశయ సాధనకై చ‌ద‌వండి)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1