రైతులను పొట్టన పెట్టుకున్న మోడీని గద్దె దించాలి
వనపర్తిలో సిపిఐ నేతల నిరసన ప్రదర్శన
వనపర్తి (న్యూస్ తెలుగు) : హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పొట్టన పెట్టుకుంటున్న నియంత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దదించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాబర్ట్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అబ్రహం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఢిల్లీలో పంటలకు కనీస మద్దతు ధర కావాలని పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల సాగు చట్టాలపై 13 నెలల పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారన్నారు. చర్చలు జరిపి డిమాండ్లు నెరవేరుస్తామని సమ్మె విరమింపజేసిన ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివే లేదని విమర్శించారు. ఫిబ్రవరి 13 నుంచి పంటకు కనీసం మద్దతు ధర చట్టం తేవాలన్న డిమాండ్తో చలో ఢిల్లీ పిలుపునిచ్చి న రైతులపై కాల్పులు జరిపి ఒక రైతు ప్రాణాన్ని బలిగొందన్నారు. మరో రైతు గుండెపోటుతో మరణించారన్నారు. రైతు ఉద్యమం సాగకుండా హర్యాన ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలను స్పందింప స్తంభింప చేసిందని ఇది దుర్మార్గ ప్రజా వ్యతిరేక చర్య అని ఖండించారు. పంట కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు పోరాడాలని, సిపిఐ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు పంట రుణం లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. స్వామినాథన్ చెప్పినట్లు ఎకరాకు రైతు పెట్టుబడి డబ్బుకు అదనంగా 50% కలిపి పంట మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళావతమ్మ, జే చంద్రయ్య, శ్రీరామ్, అబ్రహం, రాబర్ట్, శ్రీహరి, శ్యాంసుందర్, వంక గోపాల్, రమేష్, రవీందర్, భాస్కర్, రాజనగరం కృష్ణయ్య, మల్లేష్, కుతుబ్, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story: రైతులను పొట్టన పెట్టుకున్న మోడీని గద్దె దించాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!