అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రామకోటయ్య!
చాట్రాయి (న్యూస్ తెలుగు) : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్న వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారని పలువురు అంటున్నారు. గడచిన నాలుగు నెలలు క్రితం స్వతంత్ర అభ్యర్థిగా తను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన దగ్గర నుండి నేటి వరకు రామకోటయ్య సంచలనాలకు ప్రతీకగా మారుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులను పరిశీలించడానికి వందలాది మంది అభిమానులతో కలిసి కాలవ వెంట పరిశీలన చేసి సమస్యను చర్చనీయాంశంగా మార్చారు. ఆ సందర్భంలో చాట్రాయి మండలంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత ప్రైవేటు సంభాషణల్లో రామకోటయ్యను పరుష పదజాలంతో పోల్చడం వలన ఆగ్రహానికి గురైన రామకోటయ్య చాట్రాయి మండలం బూరుగగూడెం గ్రామంలో బూజుదులుపుతానని శపథం చేసారు. ప్రభుత్వ నిధులతో జరిగిన పనులపై సమాచార హక్కు చట్టం సమాచారం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పత్రికలు ప్రచురించిన వెంటనే అధికారులు హడలెత్తి పోయారు. వాయువేగంతో బూరుగగూడెం రోడ్లకు గ్రావెల్ తోలకాలు ప్రారంభించారు. మరల గత రెండు రోజుల క్రితం నూజివీడు నడిబొడ్డులో ఎస్ఆర్ఆర్ హైస్కూల్ ఆవరణంలోని స్థలాన్ని ఐదు కోట్ల రూపాయల విలువైన దాన్ని ఆక్రమణ జరిగిందని మీడియా సమక్షంలో ప్రత్యక్షంగా చూపించారు. నియోజకవర్గ మొత్తం ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. రామకోటయ్య ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే కాకుండా అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారని నియోజకవర్గ మొత్తం చర్చనీయాంశం అయింది. (Story: అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రామకోటయ్య!)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!