సూఫీ సుగంధ మహోత్సవంలో సిరిసహస్ర
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం బాబామెట్టలో జరుగుతోన్న హాజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ 65వ సూఫీ సుగంధ (ఉరుసు) మహోత్సవంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మరియు వై.యస్.ఆర్.సి.పి. రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొన్నారు . గురువారం ఖాదర్ వలీ బాబా దర్గాకు చేరుకున్న సిరి సహస్ర (సిరమ్మ)దర్గా, దర్బార్ షరీఫ్ నిర్వాహకులు ముహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ పకీరు మేళ తాళాలతో సిరమ్మకు సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గా ఆచారం మేరకు శాలువాతో సత్కరించారు. ఈ రోజు ఉరుసు 3వ రోజు సందర్భంగా ఖుల్ షరీఫ్ చందనోత్సవంలో ప్రత్యేక దర్శనం కల్పిస్తూ బాబా వారికీ చాదర్, పువ్వులు, సమర్పించారు. సిరి సహస్ర ఖాదర్ బాబా దర్గాకు చాదర్, స్వీట్స్ తీసుకునివెళ్ళి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మేళ తాళాలతో జెండా ఆవిష్కరించారు. నిర్వాహకుల ఖలీల్ ఉల్లా షరీఫ్ సోదరులు మహమ్మద్ ఖ్వాజ బాబా వారితో ప్రత్యేక ఉరేగింపుగా తీసుకువెళ్లి సిరమ్మ చేతితో నిత్యాన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించి, అందరికి బాబావారి మహా ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు. వారందరితో కలిసి తానూ కూడా ప్రసాదంను స్వీకరించారు. అనంతరం అక్కడ ఉన్న మహిళలు, పిల్లలతో సరదాగా మాట్లాడారు. ఖాదర్ బాబా దర్బార్ నిర్వాహకులు ప్రార్ధనలు నిర్వహించి, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా సిరిసహస్ర మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా బాబా ఉరుసు ఉత్సవంలో భక్తజనం పాల్గొనడం విశేషమన్నారు. ఎక్కడా, ఎన్నడూ జరగని విధంగా ఖాదర్ బాబా దర్గాలో నిత్యాన్నదాన క్రతువు జరగడం మహా అద్భుతమని ఆమె అభివర్ణించారు. బాబా వారి దయతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని సిరి సహస్ర ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాద్యక్షుడు తోట వాసు,సెక్రటరీ జాకీర్ హుస్సేన్, సభ్యులు జగదీష్, శివ, చందక శ్రీనివాసరావు, అభిరామ్, త్రినాద్, సాయి, నవీన్, హేమంత్, భాస్కర్, రాకేశ్, గిరి ,చిన్నా రావు, దక్షిణమూర్తి, దర్గా నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story: సూఫీ సుగంధ మహోత్సవంలో సిరిసహస్ర)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!