బ్రేకింగ్! నూజివీడు వైసీపీ అభ్యర్థిగా ముద్దరబోయిన?
నూజివీడులో తిరువూరు ఫార్ములా!
ఈవీ శ్రీనివాస్ (చాట్రాయి-న్యూస్ తెలుగు)
తెలుగు దేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసిపి నూజివీడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వనీయవర్గాల కథనం. సామాజిక తరగతికి చెందిన వైసిపి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించిన నేపథ్యంలో గడచిన పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో రెండు దఫాలుగా పోటీ చేసి ఓడిపోయి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మూడోసారి పోటీకి సిద్ధపడగా అనూహ్యంగా సీటు పార్థసారథికి కేటాయించడంతో ఆయన సందిగ్థంలో పడ్డారు. ఇటీవల నూజివీడులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన ముద్రబోయిన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముద్దరబోయిన నూజివీడు సీటు తనకిచ్చేటట్లయితేనే వైసీపీలో జాయిన్ అవుతానని, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలలో కూడా ఓట్ బ్యాంక్ ఉందని, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ టిడిపి నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో తిరువూరులో రోజురోజుకీ వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో తిరువూరు ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి నూజివీడులో కూడా అమలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముద్దరబోయిన వైసీపీ తీర్థం పుచ్చుకుంటే, నూజివీడు నియోజకవర్గ రాజకీయాలు ఉన్నట్టుండి ఊపందుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (Story: బ్రేకింగ్! నూజివీడు వైసీపీ అభ్యర్థిగా ముద్దరబోయిన?)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!