Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రాణదాతకు గూడు కరువు!

ప్రాణదాతకు గూడు కరువు!

0

ప్రాణదాతకు గూడు కరువు!

పాలకోడేరు (న్యూస్ తెలుగు): ఎవరికి ఆపద వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళవలసిన సమయంలో ఠక్కున గుర్తు వచ్చేది 108 అత్యవసర వాహనం. అలాంటి వాహనానికి గూడు కరువై ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఏ మహానుభావుడైనా తనకి తనకి ఒక గూడు ఏర్పర్చక పోతారా అని గత మూడేళ్లుగా ఎదురు చూసి అలసి పోయింది. మొట్టమొదటి సారిగా సత్యం కంప్యూటర్స్ అధినేత బైర్రాజు రామలింగరాజు అత్యవసర పరిస్థితుల్లో గంట లోపు బాధితున్ని హాస్పిటల్ లో చేర్చ గలిగితే ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించవచ్చు అనే సదుద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 70 అత్యవసర వాహనాల్ని 108 టోల్ ఫ్రీ నంబర్ తో 24×7 సేవలు అందించే విధంగా 2005 ఆగస్టు 15 తేదీన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా భీమవరం బి.వి.రాజు కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు.
108 అంబులెన్స్ సేవలు అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడం తో అప్పటి ముఖ్యమంత్రి దివంగ‌త నేత రాజసేఖర్ రెడ్డి వాటి సంఖ్యను పెంచి తొంబై శాతం నిధులు ప్రభుత్వ వాటా గా మిగిలిన పది శాతం ప్రైవేటు సంస్థలు భరించే విధంగా ఒప్పందం కుదిర్చి ప్రతి నియోజక వర్గానికి ఒక 108 అత్యవసరం వాహనాన్ని అందుబాటులో ఉంచారు. జగన్ తను అధికారం లోకి వ‌స్తే వంద శాతం నిధులతో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2020 సంవత్సరం లో ఒకేసారి 720 కొత్త 108 అంబులెన్స్ లను ప్రారంభించారు. ఇలా కేటాయించిన అంబులెన్స్ లలో పాలకోడేరు మండలానికి అధునాతన పరికరాలతో కూడిన అత్యవసర వాహనం అనునిత్యం ఎంతో మంది క్షతగాత్రులను హాస్పిటల్ కి చేర్చి ప్రాణ దాతగా నిలిచింది. దానిలో పని చేసే సిబ్బంది
అంకితభావంతో చిత్త‌శుద్ధితో సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. కానీ ఇన్ని సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్న సిబ్బందికి సరైన వసతులు, అత్యవసర వానానికి గూడు కల్పించక పోవడం గమనార్హం. ఇప్పటికీ అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణం సిబ్బందికి సరైన వసతులు, వాహనానికి గూడు ఏర్పర్చాలని పలువురు కోరుతున్నారు. (Story: ప్రాణదాతకు గూడు కరువు!)

See Also: 

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version