మెంటాడ అగ్ని ప్రమాద బాధితులకు అండగా సిరి సహస్ర
విజయనగరం (న్యూస్ తెలుగు) : ఉమ్మడి విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాద భాధితులైన రేగిడి రవణమ్మ, రమేష్ కుటుంబాన్నిజిల్లా పరిషత్ చైర్మన్, వై.యస్.ఆర్.సీపీ . రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ )పరామర్శించి వారికీ అండగా నిలబడ్డారు.
సిరి సహస్ర శనివారం నాడు సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. 9 నెలల నిండు గర్భంతో ఇల్లు కోల్పోయి నిరాశ్రయ స్థితిలో ఉన్న రేగిడి రవణమ్మని చూసి ఒక్క సారిగా చలించిపోయారు. వారి ఇంటికి కావలసిన గ్యాస్ స్టవ్, స్టీల్ సామాన్లు, వంట పాత్రలు, దుప్పట్లు, బట్టలు, తదితర సామాగ్రిని అందచేసారు. ఇకపై ఏ కష్టమొచ్చినా చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం స్థానిక మహిళలు, పిల్లలతో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలందరికీ బిస్కెట్ పాకెట్స్ పంచిపెట్టారు. (Story: మెంటాడ అగ్ని ప్రమాద బాధితులకు అండగా సిరి సహస్ర)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2