ఖుషి కలెక్షన్ల జోరు!
బాక్సాఫీస్ కలెక్షన్స్ జోరు కొనసాగిస్తున్న “ఖుషి”, రెండో రోజుకు రూ.51 కోట్ల గ్రాస్ వసూళ్లు
టాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 30.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజుకు 51 కోట్ల రూపాయలు ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. నైజాం ఏరియాలో రెండో రోజున ఖుషి 3.3 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఖుషికి పెరుగుతున్న బుకింగ్స్ మూడో రోజైన సండే కూడా ఇదే జోరు కొనసాగుతుందని సూచిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మరోవైపు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. రెండో రోజునే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించింది. కలెక్షన్స్ చూస్తుంటే మరికొద్ది రోజుల పాటు ఖుషి జోరు కొనసాగేలా ఉంది. (Story: ఖుషి కలెక్షన్ల జోరు!)
See Also
‘సైమా’ కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను
నటుడు త్రిగుణ్ నివేదితల వివాహ వైభోగం!
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106