UA-35385725-1 UA-35385725-1

జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు!

జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు!

జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలలో సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు
జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జీ5 గ్లోబల్ తన ప్రేక్షకుల కోసం 3 గంటలు ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది

హైదరాబాద్: దక్షిణాసియా సినిమాలు, కంటెంట్‌ను అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 Global, జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ అనే షోను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తోంది. ప్రపంచ తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు, నేహా శెట్టితో సహా పలువురు అగ్ర తారలు పాల్గొన్న ఈ 3 గంటల సుదీర్ఘ వేడుక, ఉత్తమ తెలుగు వినోదాన్ని అందిస్తూ, తెలుగు క్యాలెండర్‌లోని శుభప్రదమైన 5వ నెల శ్రావణాన్ని గౌరవించింది.

ఈ నైట్‌కు గ్లామర్‌ని జోడిస్తూ, హోస్ట్‌లు సిరి హనుమంత్ మరియు రవి, అలియాస్ రవి రాక్లే, తారలతో కలిసి సంప్రదాయం, వినోదాల మేళవింపుతో ప్రదర్శించిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దక్షిణాసియా సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా ప్రముఖ తెలుగు డ్రామా ‘త్రినయిని’లో ప్రధాన కథానాయిక ఆషిక ఆధ్యాత్మిక ప్రదర్శనను కూడా ఆకట్టుకోనుంది. అనంతరం పడమటి సంధ్యా రాగం, శుభస్య శీఘ్రం, మా వారు మాష్టారు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి ప్రదర్శనలతో తారలు అదరగొట్టారు. సరిగమప గత సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్మిత సైతం ప్రేక్షకుల కోసం సంగీత సంగీత మాధుర్యంతో అలరించారు.

జీ5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ, “తమ వారసత్వం గురించి గర్వించే దక్షిణాసియా పౌరులకు భాషలతో ఎంతో శక్తివంతమైన అనుబంధం ఉంటుంది. జీ5 గ్లోబల్‌లో అత్యధికంగా వినియోగించబడే భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు, షోలకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయా భాషలలో కంటెంట్ వినియోగం పెరుగుతోంది. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘శ్రావణమాసం వచ్చిందమ్మా సంబరాలు తెచ్చిందమ్మా’ పేరిట ప్రత్యేక షో ద్వారా తమకు ప్రియమైన భాషా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా తమకు అవకాశం రావడం ఎనలేని గర్వకారణం’’ అని పేర్కొన్నారు.

గ్లోబల్ వీక్షకులు జీ5 గ్లోబల్‌లో తెలుగు భాషలో వినోదం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. వారు ZEE5 గ్లోబల్ తెలుగు లైబ్రరీలో గోల్డెన్ గ్లోబ్స్ మరియు ఆస్కార్-విజేతగా నిలిచిన పీరియడ్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాటు, బ్లాక్ బస్టర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసార, అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తికేయ 2 తదితరాలు ఉన్నాయి.

జీ5 గ్లోబల్‌లో అత్యుత్తమ తెలుగు వినోదాన్ని వీక్షించండి

వీక్షకులు జీ5 గ్లోబల్‌లోని 111+ టైటిల్స్‌ను మిస్ కాకుండా చూడాలంటే వార్షిక ప్యాక్‌కి సబ్‌స్ర్కైబ్ కావలసి ఉంటుంది. పరిమిత-కాలపు ప్రత్యేక ఆఫర్ ధరను పొందడం ద్వారా వారు ఏడాది పాటు నిరంతరం వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ / ఐఓఓస్ యాప్ స్టోర్ నుంచి జీ5 గ్లోబల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది రోకు (Roku) డివైజ్‌లు, యాపిల్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు, అమెజాన్ ఫైర్ టీవీ మరియు శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంది. వినియోగదారులు www.ZEE5.com లోనూ జీ5 గ్లోబల్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. (Story: జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు)

See Also

అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1