సమగ్ర శిక్ష ఉద్యోగులకు ధర్మసమాజ్ పార్టీ మద్దతు
సిద్దిపేట్: సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు రోజులుగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తున్న ధర్నాకి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ సంఘీభావం తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రోళ్ళ రవిబాబు మహారాజ్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న సిఆర్టి లు, సిఆర్పిలు, ఐఆర్పిలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు గా జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఎంపికై విద్యాశాఖ సమగ్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నారు. ఇంతగా పని చేస్తున్నప్పటికీ చాలీచాలని జీతాలు అరకొర సదుపాయాలతో, కుటుంబాలని పోషించుకుంటూ తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో అవే నీళ్ళు, నిధులు, నియామకాలు ఒక కెసిఆర్ కుటుంబానికి మాత్రమే చెందాయని, ముఖ్యమంత్రి, మంత్రుల శాసన సభ్యుల జీతాలు పెంచుకున్న కెసిఆర్ ఈ ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని, వాళ్లు శాశ్వతంగా రాజ్యములో ఉంటారట కానీ రెగ్యులర్ చేయరా అని ప్రశ్నించారు కనుక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీమేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి మరియు అంతవరకు కనీస వేతన సవరణ చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, జీవిత భీమా, ఆరోగ్య భీమా కల్పించాలని ధర్మసమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సదన్ మహారాజ్, డి. బి రాజు, సురేశ్, పరమేశ్వరి, ప్రసన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. (Story: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ధర్మసమాజ్ పార్టీ మద్దతు)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106