మహిళా లోకానికి రక్షకుడు అంబేద్కర్
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిబాబు మహరాజ్
సిద్ధిపేట్: ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోదర సోదరిమనుల బంధాన్ని తెలిపే రాఖీ పౌర్ణమి/ రక్షాబంధన్ సంధర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానిక డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ధర్మ సమాజ్ పార్టీ మహిళా సోదరీమణులతో రాఖి కట్టించి కనీస కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పి సిద్దిపేట జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు రవిబాబు మహారాజ్, జిల్లా నాయకులు పరమేశ్వరి మహారాణిలు మాట్లాడుతూ ప్రపంచ మహిళా లోకానికి ఈ దేశ, రాష్ట్ర, జిల్లా మహిళా సోదరీమణులకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రపంచంలోనే మహిళలకు అసలైన రక్షకుడు, మహిళలకు సర్వహక్కుల ప్రదాత దేవదేవుడు తండ్రి, మహిళలందరికీ పెద్ద అన్నయ్య విశ్వ విజ్ఞాన కెరటం బాబాసాహెబ్ భీమ్రావు రామ్జి అంబేద్కర్ అని తెలిపారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టి కనీస రుణాన్ని చెల్లించుకుంటు భారతీయ మహిళా లోకానికి ఓటు హక్కు, విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, మహిళా కార్మిక హక్కు, రాజకీయ హక్కు, ఆస్తి హక్కు, విడాకుల హక్కు, ఆర్థిక హక్కు, సర్వ హక్కులు, లింగ వివక్షత లేని సమానత హక్కు, ఆత్మగౌరవ హోదాలు తన పోరాటంతో పాటు భారత రాజ్యాంగం ద్వారా సర్వహంశాలలో , సర్వ రక్షణలు కల్పించిన దైవ సమానుడు, సోదర సమానుడు, తండ్రి సమానుడు “డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ష అని, అందుకే “అన్న దేవుడు”అంబేడ్కర్ విగ్రహానికి మహిళలంతా రాఖీలు కట్టాలని కోరారు. అంబేడ్కర్ అన్నకు ఋణం చెల్లించండి… అనే నినాదంతో సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు రాఖీలు కట్టి కృతజ్ఞత చెల్లించాలని జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా సోదరీమణులకు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిత, మమత ప్రసన్న, భవాని,జ్యోతి, స్వప్న, చంద్రకళ, రాణి, గంగోత్రి, డి.బి.రాజు, భాస్కర్,శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నారు. (Story: మహిళా లోకానికి రక్షకుడు అంబేద్కర్)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106