ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఘన నివాళ్ళుర్పించిన వోపా బాధ్యులు
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(వోపా) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని వోపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి అంజలి ఘటించి నివా«ళ్ళుర్పించారు. ఈ సందర్భంగా వోపా రాష్ట కన్వీనర్, జిల్లా గౌరవ అధ్యక్షులు వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్– ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గోన్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు ప్రధాన సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై అనేక పుస్తకాలు రాసాడన్నారు. తెలంగాణ ఉద్యమ సూరీడు జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో వోపా జిల్లా అధ్యక్షులు కట్ట విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి గజ్జెల హరిహరాచారి, కోశాధికారి యాస్వాడ అంజయ్య, కమిటి బాధ్యులు ధుంపెట లక్ష్మినారాయణ, బెజ్జంకి రవీందర్, వంగల అనోధరాచారి, శ్రీరామోజు సత్యనారాయణ, లింగంపేట సత్తయ్య, బండ్ల శివప్రసాద్, గాలిపెల్లి బ్రహ్మచారి, కొండపర్తి మురళి తదితరులు పాల్గోన్నారు. (Story: ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106