UA-35385725-1 UA-35385725-1

నచ్చినవాడు చిత్రం ట్రైలర్ విడుదల

నచ్చినవాడు చిత్రం ట్రైలర్ విడుదల

స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా మరియు కావ్య రమేష్ హీరో హీరోయిన్ గా వెంకటరత్నం తో కలిసి లక్ష్మణ్ చిన్నా స్వయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మిజో జోసెఫ్. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో

హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, విజువల్ గా మరియు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కథకి అనుగుణంగా అందరిని కొత్తవాళ్లను తీసుకున్నాను, అందరు బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ మెజ్జో జోసెఫ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రేక్షకులు ఈ చిత్రం చూసాక మంచి ఫీల్ తో ఇంటికి వెళ్తాడు , సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది.  ఆగస్టు 18న విడుదల కు సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.

హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

నటి లలిత నాయక్ మాట్లాడుతూ “నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత  లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

నటుడు ఏ.బి. అర్.పి. రెడ్డి మాట్లాడుతూ “నచ్చినవాడు అద్భుతమైన సినిమా. ఆడవాళ్లు గురించి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా అందంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమా తో వస్తున్నా లక్ష్మణ్ చిన్నా కి నా అభినందనలు” అని తెలియజేసారు.

దర్శన్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. సినిమా చాలా బాగుంది, ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరు చూడండి” అని తెలిపారు.

కెమెరా మాన్ అనిరుద్ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, మంచి కంటెంట్ ఉన్న చిత్రం, అందరికీ నచ్చుతుంది. మిజో జోసెఫ్ మంచి సంగీతం ఇచ్చారు” అని తెలిపారు.

ఈ చిత్రానికి సాహిత్యం అందించిన హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “నేను చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కి లిరిక్స్ రాసాను కానీ సినిమా పాటలకి పని చేయడం ఇదే మొదలు. లక్ష్మణ్ చిన్నా గారు నాకు ఒక పాట ఇచ్చారు, ఉదయం ట్యూన్ వస్తే మధ్యాహ్నం కాళ్ళ లిరిక్స్ రాసి పంపించాను, తర్వాత అని పాటలు నన్నే రాయమని చెప్పారు. పాటలు చాలా బాగా వచ్చాయి,  మిజో జోసెఫ్ సంగీతం చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధిస్తుంది” అని కోరుకున్నారు.

చిత్రం పేరు : నచ్చినవాడు

నటి నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు

పబ్లిసిటీ డిజైన్ : అనిల్, సాయి

సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్

కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్

ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్

DOP : అనిరుద్

ఎడిటర్ : K.A.Y. పాపా రావు

అసోసియేట్ డైరెక్టర్స్  : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్

కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి

సంగీతం – మెజ్జో జోసెఫ్

కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా

నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకట రత్నం. (Story: నచ్చినవాడు చిత్రం ట్రైలర్ విడుదల)

News on YouTube

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1