Homeటాప్‌స్టోరీబ‌న్నీ ప్ర‌శంస మ‌ర్చిపోలేను

బ‌న్నీ ప్ర‌శంస మ‌ర్చిపోలేను

బ‌న్నీ ప్ర‌శంస మ‌ర్చిపోలేను

నా మొదటి సినిమాకే ఎంతో ఆధరణ చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు..

“సామజవరగమన” ఫెమ్ రెబ్బా మోనికాజాన్  

అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌  బ్యానర్‌ పై యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, రెబ్బా మోనికాజాన్ హీరోయిన్ గా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో  రాజేష్ దండా నిర్మించిన  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ రెబ్బా మోనికాజాన్ మీడియాతో మాట్లాడుతూ

నేను మలయాళీ అయినా  బెంగళూరులో  పెరిగాను. అయితే నా చదువు  అనంతరం కొన్ని యాడ్స్ లలో నటించిన నేను మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. అయితే ఫారెన్సిక్ సినిమాకు మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే తెలుగులో  థియేటర్స్ రిలీజ్ అయిన నా మొదటి చిత్రం “సామజవరగమన”.

“Bro” సినిమా లుక్ టేస్ట్ కు వచ్చిన నేను వేరే ఫ్రెండ్ ద్వారా రాజేష్ గారిని కలవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ గురించి తెలియదు కానీ ఆ తరువాత రామ్ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడం జరిగింది.”Bro”  సినిమాలో చెయ్యకపోయినా “సామజవరగమనా” వంటి మంచి  సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది.

ఈ సినిమా నాకి చాలా స్పెషల్.  శ్రీ విష్ణు గారి సినిమాతో పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సెట్ లో శ్రీ విష్ణు గారు, నా యాక్టింగ్ కు మోడిలేషన్ కు హెల్ప్ చేయడం వలన నరేష్ గారికి, శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ కు నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను.

దర్శకుడు కూడా నా యాక్టింగ్  చాలా న్యాచురల్ గా ఉండేలా నాలోని నటనను రాబట్టుకున్నాడు. సౌత్ లాంగ్వేజ్ సినిమాలలో నటించినా కూడా తెలుగులో  నటించిన ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నా మొదటి సినిమాతోనే సీనియర్ ఆర్థిస్టులైన నరేష్,శ్రీ విష్ణు ఇలా అందరితో వర్క్ చేయడం చాలా సంతోషం గా ఉంది.

ఈ సినిమాలో నటించినందుకు తెలుగు ఇండస్ట్రీ లో అల్లు అర్జున్, గారే కాకుండా టెక్నిషియన్స్, డైరెక్టర్స్ ఇలా అందరూ నేను చేసిన సరయు పాత్రకు మెచ్చుకొని ట్వ్వీట్ చేసి నా ఏప్రిసియేట్ చేశారు.

దళపతి విజయ్ సినిమాలో నటించాలనే కోరిక బిగిల్  సినిమా ద్వారా తీరింది. అందులో ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేయడానికి ఇష్టపడి అట్లీ గారిని కలవడంతో అయన నాకొక మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఇప్పటికే ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కథలో ఇంపార్టెన్స్ ఉంటే తెలుగులోనైనా కూడా ఎలాంటి పాత్రలైనా చేస్తాను.

“సామజవరగమన₹ సక్సెస్ టూర్ కు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు నాకు లాంగ్వేజ్ రాకపోయినా నా పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపించారు. ఇలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను.

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. “Bro” సినిమాకు పనిచేయలేకపోయినా ఫ్యూచర్ లో పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమా తరువాత మలయాళం లో ఒక సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఆ తరువాత తెలుగు లో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. సామజవరగమన లాగే మంచి కథ కోసం ఎదురుస్తున్నాను. నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తాను అని ముగించారు. (Story: బ‌న్నీ ప్ర‌శంస మ‌ర్చిపోలేను)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!