Home జీవనశైలి ఆరోగ్యం వెరికోస్ వీన్స్ వ్యాధి అంటే ఏమిటి?

వెరికోస్ వీన్స్ వ్యాధి అంటే ఏమిటి?

0
Varicose Veins
Varicose Veins

వెరికోస్ వీన్స్ వ్యాధి అంటే ఏమిటి?

వెరికోస్ వీన్స్ కోసం మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్స అవకాశాలు

– సీనియర్ కన్సల్టెంట్, డా. సిబశంకర్ దలై

కాళ్ళలో సాధారణంగా పెద్దగా కనిపించే, వంకరలు తిరిగినట్టుగా వుండే ఆకుపచ్చ సిరలు, వెరికోస్ వీన్స్. ఇవి మన జీవనశైలి పరంగా కూడా  గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య లక్షణాలలో అందం పరంగా ఆందోళనలు మాత్రమే కాకుండా వాపు, తీవ్రమైన లేదా బాధాకరమైన కాళ్ళు, పిగ్మెంటేషన్, చికిత్సకు లొంగకుండా పునరావృతమయ్యే  గాయాలు మరియు ఆకస్మిక రక్తస్రావం వంటి తీవ్రమైన పరిస్థితుల వరకూ  ఉంటాయి. దీనినే వెరికోస్ వీన్స్ అని పిలుస్తారు. ఇదొక కొత్త రోగ‌మేమీ కాదు. కాక‌పోతే త‌ర‌చూ జ‌నాన్ని వేధిస్తున్న రోగం.
ఇటీవలి గణాంకాలు వెల్లడించే దాని ప్రకారం దాదాపు 40% మంది పెద్దలు వెరికోస్ వీన్స్ తో బాధపడుతున్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు చికిత్స చేయకుండా వదిలేస్తే, ఆ సమస్య మరింత తీవ్రమై రక్తస్రావం, గడ్డకట్టడం మరియు అల్సర్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది, దానితో పాటుగా జీవన నాణ్యత పై ప్రతికూల ప్రభావమూ చూపుతుంది. ముందుగానే సమస్యను గుర్తించటం మరియు తగిన చికిత్స అందించటం ద్వారా వెరికోస్ వీన్స్ పురోగతిని తగ్గించుకోవచ్చు.
విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్‌లో న్యూరో వాస్క్యూలర్ ఇంటర్వెన్షన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సిబశంకర్ దలై మాట్లాడుతూ, “వైద్య సాంకేతికతలో ఇటీవలి పురోగతులు వెరికోస్ వీన్స్ చికిత్సలను తక్కువ హానికరంగా మార్చాయి, ఆసుపత్రిలో గడిపే సమయాన్ని తగ్గించాయి, రోగి సౌకర్యాన్ని పెంచటం తో పాటుగా రోగికి మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. లేజర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (RFA) మరియు స్క్లెరోథెరపీ వంటివి గతంలో ఎక్కువగా వినియోగించిన  చికిత్సా విధానాలు అయితే, ఇప్పుడు మన భారతదేశంలో ఎఫ్ డిఏ  ( FDA) -ఆమోదిత చికిత్స అయిన ఆధునిక  ఎడ్హెసివ్ చికిత్స అందుబాటులో ఉంది. ఇతర మెడికల్ సూపర్‌గ్లూస్‌తో పోలిస్తే ఈ పద్ధతి ప్రత్యేకంగా బంకగా వున్న సూత్రీకరణను ఉపయోగిస్తుంది, ఇది వెరికోస్ వీన్స్ కోసం కొత్త నాన్-థర్మల్, నాన్-ట్యూమెసెంట్ చికిత్సగా నిలుస్తుంది ” అని అన్నారు.
ఎడ్హెసివ్ చికిత్స సాంప్రదాయ లేజర్ లేదా ఆర్ఎఫ్ఏ  చికిత్సలకు మంచి ప్రత్యామ్నాయం అందిస్తుంది. ఈ పద్ధతిలో, రోగులు కేవలం 2-3 మిల్లీమీటర్ల చిన్న పంక్చర్‌తో కూడిన  విధానాన్ని సాధారణ ఔట్ పేషెంట్  విభాగంలో ఎదుర్కొంటారు. ఈ ఎడ్హెసివ్ చికిత్స యొక్క ప్రయోజనాలలో అతి తక్కువ శస్త్రచికిత్స అనంతర వాపు లేదా తిమ్మిరి,  శస్త్రచికిత్స తర్వాత అతి తక్కువ నొప్పి మరియు వేగంగా కోలుకోవటం వంటివి కనిపిస్తాయి. సాధారణంగా ఈ పద్దతిలో రోగులు చికిత్స గదిని  వదిలిన వెంటనే,  అదే రోజు వారి సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. ఈ పద్దతిలో  దీర్ఘకాలిక విజయాల రేటు 95% వద్ద ఉండటంతో, ఇది వెరికోస్ వీన్స్ లకు అత్యంత ప్రభావవంతమైన చికిత్స గా నిలుస్తుంది” అని అన్నారు.
వెరికోస్ వీన్స్ ను నిర్వహించడంలో ప్రారంభ దశ లోనే  రోగ నిర్ధారణ చేయటం మరియు చికిత్స కీలకం. నివారణ చర్యలలో ఇవి ఉండవచ్చు :
• ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మరియు సాధారణ శారీరక వ్యాయామాలు చేయటం
• ఒక వేళ మీ ఉద్యోగంలో  ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడి ఉండటం అవసరమైతే, మీ కాళ్లలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేందుకు మధ్య మధ్య లో కొద్ది సేపు నడవటం ముఖ్యం
• బిగుతుగా ఉండే దుస్తులను ధరించటం నివారించాలి, బిగుతు వస్త్రాల వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక పోవచ్చు.
• తక్కువ ఉప్పు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. (Story: వెరికోస్ వీన్స్ వ్యాధి అంటే ఏమిటి?)
In English…
Minimally Invasive Treatment Options for Varicose Veins-
Dr. Sibasankar Dalai, Senior Consultant at Medicover Hospitals
 
Varicose veins, the visibly enlarged, twisted greenish veins commonly found in the legs, can pose a significant lifestyle risk. Symptoms can range from aesthetic concerns to more serious conditions such as swollen, heavy, or painful legs, pigmentation, recurrent non-healing wounds, and even spontaneous bleeding.
Around 40% of adults suffer from varicose veins according to recent statistics, and the incidence appears to be on the rise globally1. These conditions, if left untreated, can deteriorate and lead to complications such as bleeding, clotting, and ulcers, negatively impacting the quality of life. Early diagnosis and treatment can mitigate the progression of varicose veins.
Dr. Sibasankar Dalai, Senior Consultant – Neuro Vascular Intervention at Medicover Hospitals, Visakhapatnam said, “Recent advancements in medical technology have made varicose vein treatments less invasive, reducing hospitalization time, increasing patient comfort, and yielding better patient outcomes. While Laser Radiofrequency Ablation (RFA) and Sclerotherapy were the most prevalent treatment procedures in the past, we now have Modern Adhesive Therapy, a FDA-approved treatment option, available in India. This method utilizes a particularly viscous formulation, compared to other medical superglues, reducing the risk of it escaping into normal veins from the target site. This represents a new non-thermal, non-tumescent treatment for varicose veins.”
Adhesive therapy presents a promising alternative to traditional Laser or RFA treatments. With this method, patients experience a simple outpatient procedure involving just a single minor puncture of 2-3mm. The benefits of Adhesive therapy include minimal postoperative swelling or numbness, reduced postoperative pain, and a notably quick recovery time, allowing patients to typically leave the treatment room immediately and return to their normal activities on the same day. With a long-term success rate standing at about 95%, it’s a highly effective treatment for varicose veins23.
Early diagnosis and treatment are crucial in managing varicose veins. Preventative measures can include:
• Maintaining a healthy weight and engaging in regular physical activity
• If your job requires extended periods of sitting or standing, taking short regular walks to stimulate blood flow in your legs is important
• Avoiding tight clothing as it could restrict blood flow
• Consuming a low-salt, fiber-rich diet.
– Ends –
Disclaimer: The views/suggestions/opinions expressed in the article are individual opinions of Dr. Sibasankar Dalai, Senior Consultant – Neuro Vascular Intervention at Medicover Hospitals, Visakhapatnam, and are for public awareness and information purposes only. This article and the views expressed herein are not to be treated as medical advice. You need to consult your registered medical practitioner for any clarification or guidance that you require around this article.
References:
1. Tisi PV. Varicose veins. BMJ Clin Evid. 2011 Jan 5;2011:0212. PMID: 21477400; PMCID: PMC3217733.
2. Proebstle T, Alm J, Dimitri S, et al. Three-year follow-up results of the prospective European Multicenter Cohort Study on Cyanoacrylate Embolization for treatment of refluxing great saphenous veins. J Vasc Surg Venous Lymphat Disord. March 2021;9(2):329–334
3 Almeida JI, Javier JJ, Mackay EG, et al. Thirty-sixth-month follow-up of first-in-human use of cyanoacrylate adhesive for treatment of saphenous vein incompetence. J Vasc Surg Venous Lymphat Disord. September 2017;5(5):658–666.

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version