జగన్ సర్కారుకు ఇంత నిర్లక్ష్యమా?
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు..!
ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్నా ఇంతవరకు ఓపికతోనే భరించాం..ఇకభరించలేం..!!
ఉద్యోగులు చేపట్ట బోవు ఉద్యమాల వల్ల ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలిగినా…దానికి ప్రభుత్వానిదే పూర్తి బాద్యత..!!!
బొప్పరాజు & పలిశెట్టి దామోధర్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకుండా, కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం గతంలో మేము ఎన్నడూ చూడలేదు.
మా కుటుంబ అవసరాల కోసం మా డబ్బులు మాకు చెల్లించండి మహాప్రభో అని వేడుకుంటున్నా సరే మా మొరను ఆలకిస్తున్నారు గాని పరిష్కరించే నాధుడే కనిపించడంలేదు.
మేము దాచుకున్న డబ్బులు కూడా మా అవసరాలకు మాకు ఇవ్వని కారణంగా మా ఆడపిల్లలు పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకోవల్సినపరిస్దులు వచ్చింది. అలాగే కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైనా సందర్బాలలో కూడా మెరుగైన చికిత్సచేయించుకోలేని దుర్బరమైన పరిస్దితులలో ఉద్యోగులు పరిస్ది ఉంది. సకాలంలో పిల్లల చదువుల ఫీజులు కట్టలేక స్కూలు/కాలేజ్ యాజమాన్యాలు మా పిల్లలను బయటకు పంపే పరిస్థితి..
బ్యాంక్ లలో సకాలంలో వాయిదాలు కట్టలేకపోతుంటే, వడ్డీల మీద వడ్డీలు మా నుండి వసూలు చేసే పరిస్థితి…
ఇన్ని బాధలు పదే.. పదే చెప్తున్నా, ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితే లేదు.ఇలాంటి… తప్పనిసరి పరిస్దితులలో ఉద్యమానికి సిద్దపడాల్సి వస్తుందని ఏపి జెఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు శుక్రవారం రెవిన్యూ భవన్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతు తప్పని సరిపరిస్దితులలో ఉద్యోగులుగా చేపట్టబోవు మా న్యాయమైన ఉద్యమానికి,ప్రజలు,ప్రజా సంఘాలు మద్దతు కావాలని వారు విజ్ఞప్తిచేసారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులలో ఉన్న తీవ్రమైన అసంతృప్తి, ఒత్తిడికారణంగానే ఉద్యమానికి సిద్దపడాలని ఈనెల 5 న కర్నూలులో జరిగిన ఏపి జెఏసి అమరావతి 3 వ రాష్ట్రమహాసభలో నిర్ణయించడం జరిగింది. అందులో బాగంగానే ఈనెల 13 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి 50 పేజీలతో ఉద్యోగుల ప్రధానమైన సమస్యలతో మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఉద్యోగులకు సంబందించిన ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు పరిష్కరించడంలో కూడా ఇంకా ప్రభుత్వం జాప్యం చేస్తే మాత్రం ఈనెల 26 న విజయవాడ రెవిన్యూభవన్ లో నిర్వహిస్తున్న ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, కలిసొచ్చే ఇతర సంఘాలు/జేఏసీ లను కలుపుకుని, భవిష్యత్ ఆందోళణా కార్రక్రమాల షెడ్యూల్ ను ప్రకటిస్తామని వారు తెలిపారు.
ఆర్థికపరమైన ప్రధాన అంశాలు:
👉 11 వ పిఆర్సీ లో పొందుపరచిన క్యాడర్ వారి స్కేల్స్ ని సంబంధిత శాఖాధిపతులకు నేటికీ పంపనందున, 2018 తర్వాత ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు వారి కొత్త పే స్కేల్ ఎంతో తెలియని పరిస్దితి ఉంది.కేవలం ప్రస్తుతం 2015-PRC స్కేలును 2022-prc స్కేలుతో పోల్చుకుని జీతాలు డ్రా చేస్తున్నాము.
👉 11వ PRC లో, చాలా శాఖలలో ఉద్యోగులకు స్పెషల్ పే లు, అలవెన్సులు పై కమిటీ నియమిస్తున్నాము అని చెప్పినప్పటికీ, నేటికీ ఎలాంటి ఉత్తర్వులు లేవు తద్వారా చాలా శాఖలలో కొన్ని cadre ఉద్యోగులకు ఆర్ధిక నష్టం జరుగుతుంది.
👉 11వ పీఆర్సి (అమలు తేదీ 1.4.2020 నుండి 31.12.2021 మద్య కాలానికి) అరియర్స్ ఎప్పుడూ చెల్లిస్తారో తెలియదు.
👉 పెండింగు డిఏ లు పై ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన GO లు (1.7.2018, 1.1.2019 & 1.7.2019 కాలాలకు) నేటికీ అమలుకు నోచకోలేనందున ఉద్యోగులకు పెన్సనర్ల కు తీవ్ర నష్టం.
👉 కొత్త DA లు (అంటే ధరలకు అనుగణంగా పెంచే భత్యం) 2022 జనవరి నుండి ఇప్పటి వరకూ ఊసే లేదు.ఎప్పుడు ఇస్తారోకూడా తేలియదు.
👉 గత సంవత్సరం క్రితం పదవీ విరమణ లేదా మరణించిన ఉద్యోగ, ఉపాద్యాయులు ఎవరికి ఎలాంటి ఆర్థికపమైన బెనిఫిట్స్ నేటికీ అందలేదు.
👉 ఎర్నెడ్ లీవులు, సరెండర్ లేవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లోనులు/విత్ డ్రాలు, లీవ్ సాలరీలు, సప్లిమెంట్ బిల్లులు, టూర్ టి ఏ బిల్లులు గత రెండు సంవత్సరాలుగా రావడం లేదు.
👉 ఈ ఆర్థిక, అర్దికేతర సమస్యలపై అనేక పర్యాయాలు ప్రభుత్వం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) దృష్టికి అనేక పర్యాయాలు తీసుకుని వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. స్వయంగా GoM లోని గౌ|| మంత్రివర్యులు మా ఆర్ధిక పరమైన అంశాలు అన్నీ సంక్రాంతి లోపు పరిష్కరిస్తామని ఉద్యోగసంఘాలు మాట ఇచ్చి కూడా ఎందుకు మాట తప్పుతున్నారో తెలపాలి.
👉 సాక్షాత్తు గౌ|| సిఎం గారే గత ఏడాది ఏప్రిల్ , జూన్ నాటికి అన్నీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం, ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు జెఏసి నాయకుల సమక్షంలో మీడియా సాక్షిగా చెప్పారు అయినా దానిసంఘాతి మర్చి పోయారు..ఇంటి పరిస్దితులలో ఇంకా నమ్మలేకనే ఉద్యామానికి సిద్దపడాల్సి వస్తుంది.
👉 ఇక నెలవారీ జీతాలు/పెన్సన్లు చెల్లింపులు ఎప్పుడు పడతాయాఅని ఎదురు చూడాల్సిన పరిస్దితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది.
👉 ప్రభుత్వమే CPS రద్దు చేసి, పాత పింఛను విధానం తెస్తామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించి, ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు కూడా cps ఉద్యోగ సంఘాల నాయకులను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లి, మరలా ఇప్పుడు ఇంకొక కొత్త విధానం అమలు చేయాలని చూడడం ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాలి.
👉 సిపియస్ ఉద్యోగులకు వారి జీతాలునుండి రికవరీ చేస్తున్న cps వాటాను PFRDA కు చెల్లించకుండా, గత 11 నెలలు గా ప్రభుత్వం ఎందుకు వాడేసుకుంటుందో సమాదానం చెప్పాలి.
👉 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని హామి ఇచ్చిన ప్రభుత్వం పక్కరాష్ట్రాలు అయినా తెలంగాణా,ఒరిస్సారాష్ట్రాలలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరణ చేసినప్పటీకీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రెగ్యులర్ చేసేందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి.
👉 11వ PRC లో కనీసం 30% జీతాలు పెంచమని స్వయంగా
పీఆర్సీ కమిషనర్ మరియు సిఎస్ కమిటీ లు రికమెండ్ చేసినా సరే ఎందుకు వాళ్లకు జీతాలు పెంచడంలేదో సమాదానం చెప్పాలి.
👉 ఆర్టీసి ఉద్యోగులకు కొత్త పిఆర్శీ అమలు జరిపినా సరే… ఇంకా 2096 మందికి పాతజీతాలే ఇస్తున్నారు.ఓవర్ టైమ్ డ్యూటీ అలవెన్సులు,నైట్&డేఔట్ అలవెన్సులు కూడా గత ఆరునెలలు గా ఎందుకు చెల్లించడం లేదు,విలీనం కు ముందు ఉన్న సౌకర్యాలు అన్ని ఎందుకు తొలగిస్తున్నారో సమాదానం చెప్పాలి.
👉 రెవెన్యూ శాఖలో చిరు ఉద్యోగులైన VRA లకు DA ఇవ్వకుండా, ఇచ్చిన DA ను గత రెండు సంవత్సరాలుగా వెనక్కి తీసుకోవడం ఎంతవరకు న్యాయం..?
👉 పదోన్నతి పొందిన గ్రేడ్-II VRO లకు ఎందుకు నేటి వరకు స్కేలు ఇవ్వలేదు..?
👉 చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులు అనేకమందికి నేటికీ కారుణ్య నియామకాలు జరుపడంలో ఇంకా జాప్యం ఎందుకు చేస్తున్నారు.
మున్సిపల్ ఉద్యోగులు,వైధ్యశాఖలో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో కూడా జాప్యం చేస్తున్నారు.
ఉద్యోగులు అందరు ప్రభుత్వంలో బాగస్వామ్యూలే అని గౌరవ మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలు అందరూ అంటున్నప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి..? ఎందుకుఉద్యోగుల చెల్లింపులు ఆలస్యం జరుగుంది..? ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్ అసలు ఏమౌతుంది..? మేము ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులు ఏమయ్యాయో ఎందుకు ఈ గౌ||మంత్రివర్గ ఉప సంఘం గానీ లేదా మా ఆర్ధిక అంశాలపై పూర్తి భాధ్యత వహించాల్సిన ఆర్ధిక శాఖ ఉన్నతాధకారులు మాకు తెలియ చేయడం లేదో ప్రజలకు,ఉద్యోగులకు ప్రభుత్వం చెప్పాలని బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావులు డిమాండ్ చేసారు.
కనీసం….ఉద్యోగులకు/పెన్సర్లకు చట్టప్రకారం ప్రతినెలా 1 తేదీన ఎందుకు జీతాలు/పెన్సన్లు చెల్లించడంలేదు..? మీకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు ప్రభుత్వంలో భాగమైన మాకు ఎందుకు చెప్పారు…?
ఉద్యోగసంఘనాయకులిగా ఉద్యోగుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ న్యాయమైన సమస్యలు సాధనకోసం ఇప్పటికూడా పోరాటాని సిద్దపడకపోతే లక్షలాదిమంది ఉద్యోగులకు అన్యాయం చేసిన సంఘ నాయకులుగా మిగిలి పోతామని వారు తెలిపారు.
ఇప్పటికి కైనా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆర్దికపరమైన సమస్యలు పరిష్కారం ఎప్పటిలోగా చెల్లిస్తారో షెడ్యూల్ ప్రకటించాలి..!ఆర్దికేతర సమస్యలు అన్ని తక్షణమే పరిష్కరించేలా చర్యలుతీసుకోవాలని చైర్మన్ బొప్పరాజు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేసారు.
నాలుగు జిల్లాల జేఏసీల జిల్లాకమిటీల ప్రమాణస్వీకారం
శుక్రవారం రెవిన్యూభవన్ లో పాత్రికేయుల సమావేశం కంటే ముందు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన యన్.టి.ఆర్ , పల్నాడు, బాపట్ల,కృష్ట్రా ఏపిజేఏసి అమరావతి జిల్లాకమిటిలతో బొప్పరాజు ప్రమాణస్వికారం చేయించారు.
ఈసమావేశంలో ఏపిజేఏసి అమరావతి రాష్ట్రనాయకులూ వి.వి.మురళీకృష్టంనాయుడు,కిశోర్ కుమార్,మల్లేశ్వర రావు,సాంబశివరావు మరియు జ్యోతి తో
పాటు నాలుగుజిల్లాల అద్యక్ష,ప్రధానకార్యదర్శులు ఈశ్వర్ దొప్పాలపూడి,కనపర్తి సంగీతరావు ,k రాజ రమేష్,నగమల్లేశ్వర రావు,వై.శ్రీనివాసరావు..తధితరులు. (Story: జగన్ సర్కారుకు ఇంత నిర్లక్ష్యమా?)
పాల్గొన్నారు.
See Also :