ఘోరాతి ఘోరం!

ఘోరాతి ఘోరం!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ప్రమాదం.. 20 మంది మృతి!

అనంత‌పురం: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కానీ 20 మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. 38 మందికి గాయాల‌య్యాయి. ఈ బ‌స్సులో 130 మంది ప్ర‌యాణిస్తున్నారు. రెండు బ‌స్సుల్లో వెళ్లాల్సిన వారు ఒకే బ‌స్సులో వెళ్లాల్సి రావ‌డంతో బ‌స్సు ఓవ‌ర్‌లోడ్ అయింది. పైగా డ్రైవ‌రు నిర్ల‌క్ష్య కార‌ణంగానే బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డిన‌ట్లు పోలీసులు చెపుతున్నారు.

అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. మృతుల్లో టాప్‌పై నుంచి దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ఏపీకి చెందిన షాన్‌వాజ్‌(20) మృతి చెందారు. కంబదూరు మండలం బెస్తరపల్లిలో ఇతను మెకానిక్‌గా పని చేసేవాడని గుర్తించారు. మృతుల్లో కర్ణాటక వాసులు అమూల్య(20), అంజిత్‌(23), కల్యాణ్‌(27) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ దుర్ఘ‌ట‌న‌లో 20 మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే, శ‌వాల‌ను పోస్ట్‌మార్ట‌మ్‌కు తీసుకువెళ్ల‌కుండా వారి బంధువులు వాటిని తీసుకుపోయిన‌ట్లు తెలిసింది. దీంతో ఎంత మంది చ‌నిపోయారో అధికారికంగా తెలియ‌డం లేద‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. (Story: ఘోరాతి ఘోరం!)

ఘోరాతి ఘోరం! న్యూస్ ఫుల్ వీడియో కోసం మీడియాఫైల్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను చూడండి! (Copy Paste the bolow URL)

https://www.youtube.com/channel/UCu2Q3FwLOZJ_eR_A-1YDwsg

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!