‘ఈ కథలో నేను” టైటిల్ లోగో
‘ఈ కథలో నేను” టైటిల్ లోగో: అవతార్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1 గా నిర్మించిన చిత్రం ”ఈ కథలో నేను”. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్, గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా కథ మాటలతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రంలో హీరోలుగా హోమానంద్, రేవంత్ – హీరోయిన్ గా సిమ్రాన్ పరింజా( తెలుగు కిర్రాక్ పార్టీ ఫేం), నటించారు. ఇతర పాత్రల్లో నరేష్, పోసాని కృష్ణమురళి, మధునందన్, బిగ్ బాస్ తేజస్విని, అభయ్ బేతిగంటి ఈ రోజుల్లో సాయి, కిరీటి, జబర్దస్త్ రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, శశిధర్, అనిత, సావేరి నటించారు. ఈ సినిమాకు రాజ్ కృష్ణ, యష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా దివంగత పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం. సాయికిరణ్, రెహమాన్, సాగర్ సాహిత్యం అందించారు. మధు రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీయోగి సంగీతం అందిస్తున్నారు. మల్హర్ బట్ జోషి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. అచ్చిబాబు. ఎం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యం.యస్. ఫణిరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టి.వి కేశవతీర్థ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోని ఆ చిత్ర బృందం శనివారం నాడు విడుదల చేసింది. త్వరలో ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. (Story: ‘ఈ కథలో నేను” టైటిల్ లోగో)