UA-35385725-1 UA-35385725-1

మహా శివరాత్రికి భోళా శంకర్ ఫస్ట్ లుక్!

మహా శివరాత్రికి భోళా శంకర్ ఫస్ట్ లుక్!

మహా శివరాత్రికి భోళా శంకర్ ఫస్ట్ లుక్!: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర ల మెగా మాస్సివ్ మూవీ భోళా శంకర్ ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి మార్చి 1న విడుదల

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్సివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్”, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

 రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో  నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

స్వాగ్ ఆఫ్ భోలా పేరుతో ఈ చిత్రం  ప్రీ-లుక్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, ఈ సినిమా ఫస్ట్ లుక్  సమయం వచ్చేసింది. భోలా శంకర్ ఫస్ట్ లుక్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ఉదయం 9:05 గంటలకు విడుదల కాబోతుంది. శివునికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం అని మేకర్స్ భావించారు

జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ప్రధాన నాయికగా కనిపించనుంది, ఇందులో భావోద్వేగాలు మరియు ఇతర అంశాలు సరైన రీతిలో ఉంటాయి.

యువ సంచలనం మహతి స్వర సాగర్ సౌండ్‌ట్రాక్‌లను అందించగా, డుడ్లీ కెమెరా భాధ్యతలు నిర్వహిస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కథ పర్యవేక్షణ సత్యానంద్ మరియు సంభాషణలు తిరుపతి మామిడాల, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయనున్నారు. (Story: మహా శివరాత్రికి భోళా శంకర్ ఫస్ట్ లుక్!)

నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: మెహర్ రమేష్

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్,

ఎగ్దిక్యూటీవ్

నిర్మాత: కిషోర్ గరికిపాటి

సంగీతం: మహతి స్వర సాగర్

DOP: డుడ్లీ

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

కథా పర్యవేక్షణ: సత్యానంద్

సంభాషణలు: తిరుపతి మామిడాల

ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ

కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ

PRO: వంశీ-శేఖర్

VFX సూపర్‌వైజర్: యుగంధర్

పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను

డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సీఎం

లైన్ ప్రొడక్షన్: మెహెర్ క్రియేషన్స్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1