వినాయక చవితి పండుగ పురస్కరించుకొని
రక్తదాన శిబిరం ఏర్పాటు
రక్త బంధం ట్రస్టు, రజిని ట్రస్ట్
న్యూస్ తెలుగు ధర్మవరం ( శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం డివిజన్ పరిధిలోని రామగిరి మండలంలో అంబేద్కర్ కాలనీలో ఈనెల ఏడవ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రక్త బంధం ట్రస్టు, రజనీ ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతోమంది రక్తం లేకపోవడంతో నృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి తల సేమియా బాధితులకు ఈ రక్తదాన శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆసక్తిగల రక్త దాతలు తమ రక్తాన్ని దానం చేయాలని తెలిపారు. రక్తదానం మహాదానమని, ఈ రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని తెలిపారు. ఇప్పటికే మా ట్రస్ట్ సభ్యుల ద్వారా వందలాదిమందికి రక్త దానమును అందజేసి, వారి ప్రాణాలను కాపాడి పునర్జన్మను ఇవ్వడం పట్ల మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. రక్తదానం ప్రాణదానమవుతుందని, రక్తం విలువ కట్టలేనిదని, కుల మతాలకు అతీతంగా ఈ రక్త దానమును చేయవచ్చునని తెలిపారు. రక్తము ఇచ్చు దాతలు ఈ సెల్ నెంబర్ కు సంప్రదించవచ్చునని తెలిపారు. సెల్ నెంబర్లు 9391553146కు గాని 630332194 గాని 7989607335కు గాని 9966083248 గాని సంప్రదించవచ్చునని తెలిపారు. (Story :వినాయక చవితి పండుగ పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు)

