UA-35385725-1 UA-35385725-1

శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

న్యూస్‌తెలుగు/తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీజె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ప్రెస్ మరియు పబ్లికేషన్స్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1