కాయిన్ స్విచ్ ఎక్స్‌క్లూజివ్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ పరిచయం
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: భారతదేశపు అతిపెద్ద క్రిప్టో ట్రేడిరగ్ ఫ్లాట్‌ఫామ్ కాయిన్ స్విచ్. అలాంటి కాయిన్ స్విచ్ ఇవాళ స్పెషలైజ్డ్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు ప్రత్యేకంగా హెచ్‌ఎన్‌ఐ, ఇనిస్టిట్యూట్ ఇన్వెస్టర్స్‌కు అందించనున్నారు. తద్వారా పెద్దస్థాయిలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఈ సందర్భంగా కాయిన్ స్విచ్ బిజినెస్ మెడ్ బాలాజీ శ్రీహరి మాట్లాడుతూ, అమెరికాలో ఇటీవలి బీటీసీ, ఈటీహెచ్, ఈటీఎఫ్‌ల ఆమోదం తర్వాత, గ్లోబల్ క్రిప్టో స్పేస్‌పై చాలా మంది పెట్టుబడిదారులకు ఆసక్తి పెరిగింది. తద్వారా మేం భారతీయ మార్కెట్‌కు విస్తరించాలనిభావిస్తున్నామన్నారు. ఈ సరికొత్త సర్వీసును హెచ్‌ఎన్‌ఐలకు, సంస్థలకు అందిస్తారు. (Story : కాయిన్ స్విచ్ ఎక్స్‌క్లూజివ్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ పరిచయం)