ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున అన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే ఎల్ఐసి బ్రాంచ్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందని, అలాగే ప్రాణాపాయం స్థితిలో ఉన్న వారికి రక్తం దానం చేయడం రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఎం. బి. శ్రీనివాసరావు, డి ఓ. వాసు, ప్రెసిడెంట్ హరనాథ్ బాబు, బి. వెంకటేశ్వర్లు, రామారావు, అమృతవల్లి, రత్న రాజు, ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. (story : ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం)