శ్రీవారి లడ్డుపై ఆంక్షలు!
న్యూస్‌తెలుగు/తిరుమల: శ్రీవారి లడ్డుపై విధించిన ఆంక్షల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డు ఉంటే తప్ప లడ్డు ఇచ్చేది లేదంటూ ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో టీటీడీ నిర్ణయాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ మార్గాలలో (నడక, బస్సు,రైలు ద్వారా) వచ్చే సామాన్య భక్తులు కొన్ని సందర్భాలలో రద్దీ కారణంగా వెంకన్న దర్శనం 30 40 గంటలు పట్టే సందర్భాలలో శ్రీవారి దర్శనం లభించకపోతే “అఖిలాండం” వద్ద టెంకాయ కొట్టి మ్రొక్కులు తీర్చుకొని శ్రీవారి లడ్డూలను పరమ పవిత్రంగా భావించి పది లడ్లు కొని తిరుమల కొండకు వెళ్లి వచ్చామని తమ బంధువులకు, సన్నిహితులకు ప్రసాదంగా పంచి పెట్టడం ఆనవాయితీ.
శ్రీవారి దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా కేవలం “రెండు లడ్లు” మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించడం సమంజసం కాదు.
శ్రీవారి లడ్డు పై దర్శనం దొరకని సామాన్య భక్తుల విషయంలో ఆంక్షలు విధిస్తూ “రేషన్” పద్ధతిలో లడ్డు అందిస్తామని టీటీడీ ఉన్నతాధికారులు ప్రకటించిన నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది.
టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడో ఎవరో శుభకార్యాలకు వందలాది శ్రీవారి లడ్లు పంచి పెట్టారన్న దానిపై విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి తప్పు చేసిన దళారీలపై వారికి సహకరించిన ఉద్యోగస్తులపై ఉక్కు పాదం మోపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలె తప్ప, దానిని సాకుగా చూపించి సామాన్య భక్తులకు శ్రీవారి లడ్డుని దూరం చేయడం సమంజసం కాదని బీజేపీ, జనసేన, సీపీఐ నాయకులు అంటున్నారు.
టిటిడి ఉన్నతాధికారులు “లడ్డు కు డిమాండ్” క్రియేట్ చేస్తే “దళారీలు పుట్టగొడుగుల్లా” పుట్టుకొస్తారని బ్లాక్ మార్కెట్ దందాకు రెడ్ కార్పెట్ వేసిన వారవుతారు.
తిరుపతిలోని స్థానికులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు బంధుమిత్రులకు అవసరమై శ్రీవారి లడ్లు 10 పొందాలంటే కచ్చితంగా దర్శనం చేయించుకోవాల్సిందేనా అన్న చర్చ అందరిలో ప్రారంభమైంది.
టిటిడి ఉన్నతాధికారులు ఆధార్ కార్డు ఆధారంగా 2 లడ్లు అని ప్రకటించిన నిర్ణయాన్ని దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి చరవాణి ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వెంటనే స్పందించి టిటిడి ఉన్నతాధికారులతో మాట్లాడి దర్శనం దొరకని సామాన్య భక్తులకు టిటిడి ప్రకటించిన ఆధార్ కార్డు లడ్డూల విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలపాలి. శ్రీవారి లడ్డుకి డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి లడ్డుల అక్రమ తరలింపునకు టీటీడీ విజిలెన్స్ వైఫల్యమే కారణం. అందువల్ల టిటిడి విజిలెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యాన్ని సామాన్య భక్తులపై రుద్దడం సరికాదు. శ్రీవారి లడ్డుపై ఆంక్షలతో సామాన్యులకు దేవుడిని దూరం చేయడం సరైన విధానం కాదని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. (Story: శ్రీవారి లడ్డుపై ఆంక్షలు!)
See Also:
అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం
లక్కీడిప్ లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు
సెప్టెంబరు 6న ఖాళి టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం