కొత్త ఛానెల్ ఆఫరింగ్స్‌తో సామ్‌సంగ్ టివి ప్లస్ విస్తరణ
గురుగ్రామ్: భారతదేశంలో బ్రాండ్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ టీవీ (ఫాస్ట్) సర్వీస్ అయిన సామ్‌సంగ్ టివి ప్లస్, దాని పోర్ట్‌ఫోలియోలో ఆజ్ తక్ హెచ్‌డి, ది లాలాన్‌టాప్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడిరచింది. సామ్‌సంగ్ టివి ప్లస్, టివి టుడే నెట్‌వర్క్ మధ్య భాగస్వామ్యం, అత్యధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్‌ను అందించడానికి, అధికంగా కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో వీక్షకుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి సామ్‌సంగ్ నిబద్ధతను నొక్కి చెబుతుంది. టీవీ టుడే నెట్‌వర్క్ ది లాలాన్‌టాప్, ఆజ్ తక్ హెచ్‌డి నుండి అందించే ఫాస్ట్ ఛానల్ ఆఫరింగ్, ఇంటిలోని అతిపెద్ద స్క్రీన్‌పై ప్రీమియం ఉచిత కంటెంట్‌ను చూడాలనే ప్రేక్షకుల కోరికని తీరుస్తుంది. (Story : కొత్త ఛానెల్ ఆఫరింగ్స్‌తో సామ్‌సంగ్ టివి ప్లస్ విస్తరణ)