దుబాయ్‌లో ప్రత్యేక వేడుకలకు 6 మరపురాని మార్గాలు
న్యూస్‌తెలుగు/ముంబయి: జీవితంలోని మరుపురాని మైలురాళ్లను అత్యంత అసాధారణమైన మార్గాల్లో వేడుక చేసుకోవడానికి దుబాయ్ వేదికగా నిలిచింది. సాహసాల కోసం పలు ప్రదేశాలు ఎదురుచూస్తున్నాయి. వాటిలో మొదటిది స్కైడైవ్ దుబాయ్. దుబాయ్ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్‌లపై స్కైడైవ్‌తో ఉద్విగ్నభరితమైన అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే, ప్రైవేట్ ఎడారి సఫారీతో ప్రత్యేక సందర్భాన్ని మరింత ఆనందంగా మార్చుకోవచ్చు. దుబాయ్ అంతర్జాతీయ రుచుల కేంద్రంగా నిలుస్తుంది. విభిన్న రుచులను కోరుకునే వారికి వివిధ రకాల అంతర్జాతీయ వంటకాలను ప్రదర్శిస్తాయి. ఒపెరా, థియేటర్ నుండి లైవ్ మ్యూజిక్ వరకు అత్యుత్తమ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో దుబాయ్ వెలిగిపోతున్నప్పుడు -అల్ హబ్టూర్ సిటీలోని లా పెర్లేలో అసమానమైన ఆక్రోబాటిక్ దృశ్యం నిజంగా అసాధారణమైనది. దుబాయ్‌లోని ప్రఖ్యాత వెల్‌నెస్ సెంటర్‌లలో విలాసవంతమైన స్పా డేతో సంతోషం నింపుకోవచ్చు. ఇవిగాక, బహిరంగ సాహసాలను ఆస్వాదించే వారి కోసం, హట్టా కయాకింగ్, మౌంటెన్ బైకింగ్, గుర్రపు స్వారీ వంటి కార్యకలాపాలను కూడా అందిస్తుంది. (Story : దుబాయ్‌లో ప్రత్యేక వేడుకలకు 6 మరపురాని మార్గాలు)