ప్రతీ ఒక్కరూ రహదారి భద్రత పాటించాలి
ట్రాఫిక్ సిఐ సూరినాయుడు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రహదారి భద్రత పట్ల విద్యార్దులకు అవగాహన కల్పించుటలో భాగంగా పట్టణంలోని ఏజీఎల్, డిగ్రీ కాలేజ్ విద్యార్దులకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ సూరినాయుడు మాట్లాడుతూ – ప్రతీ ఒక్కరూ రహదారి భద్రత పాటించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా వాహనాల డ్రైవింగ్ చేపడ్డటంతో పాటు, ఇతరుల భద్రత పట్ల కూడా వాహనదారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. రహదారి భద్రతా నియమాలు పాటించడం వాహనదారుల బాధ్యతని అన్నారు. సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనంకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించి, ప్రమాదాలు జరగని జిల్లాగా విజయనగరంను నిలుపుదామని విద్యార్దులను కోరారు. అతివేగంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని యువత గుర్తించాలన్నారు. మైనరు డ్రైవింగ్ నేరమని, 18సం ల పూర్తి అయిన వారు వాహనంలు నడిపేందుకు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుండి లైసెన్స్ లను పొందాలన్నారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లోవరాజు, కళాశాల అధ్యాపకులు, విద్యార్దులు పాల్గొన్నారు.