ఖాతా భద్రతకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫేస్ మ్యాచ్
న్యూస్‌తెలుగు / ముంబయి: వినియోగదారుల ఖాతాలను రక్షించేందుకు మెరుగైన భద్రతా ఫీచర్, ఫేస్ మ్యాచ్‌ను ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆవిష్కరించింది. వినియోగదారుని ప్రవర్తన, లావాదేవీల విధానం, ప్రాంతం, సారూప్య నమూనా చారిత్రక డేటా, పరికరం, మొబైల్ యాప్ ఆధారిత సిగ్నల్‌ల నుంచి పలు ఇన్‌పుట్‌లు, సిగ్నల్‌ల ఆధారంగా ప్రతి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వినియోగదారుకు ఉన్న ముప్పు స్కోర్‌ను లెక్కించేందుకు ఫేస్ మ్యాచ్ అధునాతన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఒక వినియోగదారుడు ఈ ముప్పు స్కోర్‌ను అధిగమిస్తే, అవకాశం ఉన్న మోసపూరిత లావాదేవీలను నిరోధించేందుకు వారి ఖాతా ఫేస్ మ్యాచ్‌తో సురక్షితం చేయబడుతుంది. వినియోగదారుడు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వెంటనే నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారు. ఫేస్ మ్యాచ్ యాక్టివేట్ చేయబడిరదని వారికి తెలియజేయడంతో పాటు వారి లావాదేవీలను కొనసాగించడానికి నోటిఫికేషన్‌లోని లింక్‌ని ఉపయోగించి తక్షణ ధృవీకరణను పూర్తి చేయమని వారికి సూచించిస్తుంది.(Story:ఖాతా భద్రతకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫేస్ మ్యాచ్)