టీ నాణ్యతపై టాటా టీ జెమినీ అవగాహన కార్యక్రమం
వరంగల్: తెలంగాణలో ఎక్కువ మంది అభిమానించే టీ బ్రాండ్, టాటా టీ జెమినీ, టీ నాణ్యత ఆవశ్యకత గురించి తెలపటంతో పాటుగా ప్యాకెట్ల రూపంలో కాకుండా కల్తీ లేదా రంగుతో కూడి వదులుగా విక్రయించే టీ వల్ల కలిగే నష్టాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఒక కార్యక్రమంను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో కల్తీ లేదా రసాయనిక రంగు టీలు సర్వసాధారణం అయ్యాయి. ‘‘టీ (పూర్తి ఉత్పత్తి/తయారు చేసిన టీ)లో అప్పుడప్పుడు అనుమతించబడని అదనపు రంగు పదార్థాలు ఉంటాయి, వీటిని కల్తీ టీ అని పిలుస్తారు. అప్పుడప్పుడు నివేదికలు వెల్లడిరచే దాని ప్రకారం ప్రమాణాలు తక్కువగా వుండే టీ ఆకులకు బిస్మార్క్ బ్రౌన్, పొటాషియం బ్లూ, పసుపు, నీలిమందు, ప్లంబాగో మొదలైన రంగులు కలుపుతున్నారని సూచిస్తున్నాయి. ఇవి ఉత్పత్తికి కొంత ఇష్టమైన రంగు లేదా మెరుపును అందించడానికి తోడ్పడతాయి.’’ విశ్వసనీయ బ్రాండ్ నుండి సురక్షితమైన, అధిక-నాణ్యత కలిగిన ప్యాకేజ్డ్ టీ వైపు మారడాన్ని ప్రోత్సహించడం , అటువంటి పద్ధతుల దుష్ప్రభావాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం టాటా టీ జెమిని లక్ష్యం.(Story:టీ నాణ్యతపై టాటా టీ జెమినీ అవగాహన కార్యక్రమం)