హైదరాబాద్‌లో ఇకపై టొస్కానో ఇటాలియన్ రుచులు
న్యూస్‌తెలుగు / హైదరాబాద్: హైదరాబాద్ ఆహార ప్రియుల కోసం టొస్కానో.. ఇప్పుడు ఇటలీ రుచుల్ని మరింతగా పరిచయం చేయబోతోంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెల్చుకున్న టొస్కానో రెస్టారెంట్… ఘనమైన వారసత్వానికి ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. అద్భుతమైన రుచి, అంతకుమించి శుచితో నాణ్యమైన రుచుల అనుభవాన్ని అందించే వ్యూహాలతో టోస్కానో సిద్ధమైంది. ఇంకా చెప్పాలంటే ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని ఇప్పుడు మీకు అందించబోతోంది. ఇటలీ నుండి నేరుగా దిగుమతి చేసుకున్న అత్యుత్తమ స్థానిక పదార్థాలు మరియు చీజ్‌లను ఉపయోగించి చాలా ప్రత్యేకంగా మెనూని తయారు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకమైన హౌస్-క్రాఫ్టెడ్ కాక్ టెయిల్‌లతో సహా పూర్తి బార్ మెనూతో, టోస్కానో ఉల్లాసమైన వాతావరణాన్ని ఆహార ప్రియులకు వాగ్దానం చేస్తుంది.(Story:హైదరాబాద్‌లో ఇకపై టొస్కానో ఇటాలియన్ రుచులు)