నిధుల సమీకరణపై శ్రేష్ఠాఫిన్వెస్ట్ లిమిటెడ్ దృష్టి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: శ్రేష్టఫిన్వెస్ట్ లిమిటెడ్, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, రైట్ ఇష్యూ ద్వారా ఈక్విటీ షేర్లు/కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్/ఇతర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణను పరిశీలించేందుకు తమ బోర్డు ఆగస్టు 19న సమావేశమవుతుందని ప్రకటించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఫెసిలిటీ అగ్రిమెంట్‌పై సంతకం చేయడం ద్వారా మరోసారి చేతులు కలిపినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించిందన్నారు. ఈ తాజా ఒప్పందం ద్వారా, పునరుత్పాదక శక్తి, స్వచ్ఛమైన నీరు, నీటి రీసైకిల్ సంబంధిత ప్రాజెక్ట్ కోసం ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఫెలిక్స్ సేకరించామన్నారు. పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఫెసిలిటీ అగ్రిమెంట్‌పై సంతకం చేయడం ద్వారా ఫెలిక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఫెలిక్స్)తో చేతులు కలిపినట్లు కంపెనీ ముందుగా ప్రకటించింది. (Story : నిధుల సమీకరణపై శ్రేష్ఠాఫిన్వెస్ట్ లిమిటెడ్ దృష్టి)