కాప్‌స్టన్ సర్వీసెస్ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: సమగ్రమైన మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ ప్రదాత అయిన కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. క్యూ1 ఎఫ్‌వై24లో రూ. 113.25 కోట్లతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ.153.65 కోట్లుగా ఉంది, తద్వారా 35.67% వృద్ధి నమోదు చేసింది. క్యూ1 ఎఫ్‌వై24లో రూ.5.42 కోట్లతో పోలిస్తే, ఎబిట్డా రూ.6.65 కోట్ల వద్ద ఉంది, తద్వారా 22.69% వృద్ధిని నమోదు చేసింది. క్యూ1 ఎఫ్‌వై24లో రూ.2.79 కోట్లతో పోలిస్తే నికర లాభం రూ.3.32 కోట్లుగా ఉంది, ఇది 19.00% వృద్ధిని నమోదు చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి మాట్లాడుతూ, ఆదాయం, లాభదాయకత పరంగా మంచి వృద్ధి రేటును సాధించటం ఆనందంగా వుందన్నారు. (Story : కాప్‌స్టన్ సర్వీసెస్ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల)