బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ డిష్‌వాషర్ కొత్త శ్రేణి విడుదల
న్యూస్‌తెలుగు/ముంబయి: గృహోపకరణాల పరిశ్రమలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన బీఎస్‌హెచ్ ఆస్గరేట్ జీఎంబీహెచ్ అనుబంధ సంస్థ బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బాష్ మరియు సీమెన్స్ డిష్‌వాషర్‌ల సరికొత్త శ్రేణిని విడుదల చేసినట్లు వెల్లడిరచింది. పెద్ద భారతీయ కుటుంబాల అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఈ అత్యాధునిక డిష్‌వాషర్‌లు 15-ప్లేస్ సెట్టింగ్ సామర్ధ్యంతో వస్తాయి. సరికొత్త నలుపు రంగులో సొగసైన స్టెయిన్‌లెస్-స్టీల్ బేస్‌ను కలిగి ఉంటాయి. భారతదేశంలో డిష్‌వాషింగ్ విభాగంలో గణనీయంగా 53% మార్కెట్ వాటాను బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ కలిగి ఉంది. దక్షిణ భారత ప్రాంతం మార్కెట్ వాటాలో 48% వాటాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిష్‌వాషర్‌ల స్వీకరణ గణనీయమైన వేగాన్ని ప్రదర్శించింది, ఇది కంపెనీ వృద్ధికి కీలకమైన చోదకంగానూ నిలిచింది. (Story : బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ డిష్‌వాషర్ కొత్త శ్రేణి విడుదల)