నెల్లూరులో మెడికల్ సెంటర్ ప్రారంభించిన రేలా హాస్పిటల్
న్యూస్‌తెలుగు/నెల్లూరు: చెన్నైలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ మరియు క్వాటర్నరీ హెల్త్‌కేర్ సెంటర్ అయిన రేలా హాస్పిటల్, నెల్లూరు, పొరుగు జిల్లాల ప్రజలకు నిపుణుల కన్సల్టేషన్స్ మరియు ఇతర ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి నెల్లూరులో రేలా మెడికల్ సెంటర్‌ను ప్రారంభించింది. రెలా హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రొ. మొహమ్మద్ రేలా, రెలా గ్రూప్‌లోని ప్రముఖ సర్జన్లు, హెల్త్‌కేర్ నిపుణుల సమక్షంలో హాస్పిటల్‌ను తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్, వాస్కులర్ సర్జన్ ప్రొఫెసర్ సి.ఎం.కె.రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా చిత్తూరు జిల్లాకు చెందిన 8 ఏళ్ల జ్ఞాన సాయి హాజరయ్యారు. చిన్నతనంలోనే ప్రాణాంతక కాలేయ వ్యాధిని ఆమె అధిగమించింది. జ్ఞాన సాయి 2016లో రేలా హాస్పిటల్‌లో ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ను పొందారు, ఆమెకు కేవలం తొమ్మిది నెలల వయస్సులో ఈ చికిత్సను ప్రొఫెసర్ మహమ్మద్ రేలా నిర్వహించారు. (Story : నెల్లూరులో మెడికల్ సెంటర్ ప్రారంభించిన రేలా హాస్పిటల్)