UA-35385725-1 UA-35385725-1

47 శాతం పెరిగిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లాభాలు

47 శాతం పెరిగిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లాభాలు

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: నూతన తరపు డిజిటల్‌ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ), జూన్‌ త్రైమాసికంలో నికర లాభం 47% పెరిగి రూ. 70 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడిరచింది. ఇదే కాలానికి గత సంవత్సర నికర లాభం రూ.48 కోట్లుగా వుంది. క్రితం ఏడాది నికర వడ్డీ ఆదాయం రూ. 225 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సర మొదటి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 31% పెరిగి రూ. 293 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దీని నిర్వహణ లాభం రూ.117 కోట్లతో పోలిస్తే 23% పెరిగి రూ.144 కోట్లకు చేరుకుంది. ఇన్‌క్లూజివ్‌ ఫైనాన్స్‌, కమర్షియల్‌ వెహికల్‌, ఎల్‌ఏపీ వంటి కీలక వ్యాపారాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ వృద్ధి నడపబడిరది. వికాస్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో పంపిణీ క్యూ1ఎఫ్‌వై25లో రూ. 513 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 141.2% పైగా వృద్ధిని ప్రదర్శిస్తోంది. (Story : 47 శాతం పెరిగిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లాభాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1