శ్రీశైలంలో చిరుత సంచారం
న్యూస్‌తెలుగు/శ్రీశైలం: మండలంలో చిరుతపులి రాత్రి సమయాల్లో హల్ చేస్తుంది. అర్ధరాత్రి సమయంలో కుక్కలను చంపి ఎత్తుకెలుతుంది చిరుతపులి సంచారంతో స్దానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో చిరుతపులి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామం పరిధిలో రామాలయం ఆలయం సమీపంలో చిరుతపులి జనసంచారంలోకి వచ్చింది. ఓ గృహంలో పెంచుకుంటున్న పెంపుడు కుక్కులు రెండిటిని చిరుతపులి ఇంటి ఆవరణలోకి వచ్చి చంపి ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యం సిసి కెమారాలో రికార్డైయింది కుక్కలను పరిశీలించేందుకు బయటకు వచ్చిన యజమాని చిరుతపులి ఇంటికి వచ్చి వెళ్ళినట్లు గుర్తించి అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న, మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి కాని ఇప్పుడు ఏకంగా నివాస గృహాలలోకి డైరెక్ట్ గా గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. ఓ గృహంలో ఉన్న కుక్కలను చంపి నోటితో పట్టుకుని చిరుతపులి ఎత్తుకెళుతుంది. చిరుతపులి సంచారంతో స్దానికులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవిశాఖ సిబ్బంది గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (Story : శ్రీశైలంలో చిరుత సంచారం)