డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ బస్ బిజినెస్ హెడ్ నియామకం
న్యూస్‌తెలుగు/ముంబయి: డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డీఐసీవీ), డైమ్లర్ ట్రక్ ఏజీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కాగా, జులై 1, 2024 నుంచి జారీలోకి వచ్చేలా బస్ బిజినెస్ హెడ్‌గా అందముత్తు పొన్నుసామిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అందముత్తు పొన్నుస్వామి 2011లో డీఐసీవీతో తన ప్రయాణాన్ని ప్రారంభించగా, ఆటోమోటివ్ (ప్యాసింజర్ మరియు కమర్షియల్ వెహికల్) పరిశ్రమలో కార్యకలాపాల నిర్వహణలో ప్రత్యేకతలతో 35 ఏళ్లకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సత్యకం ఆర్య మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో బస్ పరిశ్రమ సుస్థిర వృద్ధిని సాధిస్తోంది. ఈ మధ్య కాలంలో వృద్ధి సాధిస్తున్న వాణిజ్య వాహనాల పరిశ్రమ పరిమాణంలో కీలక భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉండగా, ఇందులో బస్సుల విభాగం ఒక కీలక పాత్రను పోషిస్తోందన్నారు. (Story :డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ బస్ బిజినెస్ హెడ్ నియామకం)