UA-35385725-1 UA-35385725-1

ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా ప్రారంభం

ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా ప్రారంభం

స్టాక్‌యార్డుల‌వ‌ద్ద‌ బారులు తీరిన వాహ‌నాలు
సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంఎల్ఏలు

న్యూస్ తెలుగు/విజ‌య‌న‌గ‌రం: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా ప్రారంభ‌మ‌య్యింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర‌కు, సోమ‌వారం నుంచి జిల్లా యంత్రాంగం ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. దీనికోసం జిల్లాలో మూడు ఇసుక స్టాక్ యార్డుల‌ను గుర్తించారు. ఇక్క‌డ ఇప్ప‌టికే నిల్వ ఉన్న ఇసుక‌ను ఉచితంగా స‌ర‌ఫ‌రా చేప‌ట్టారు. ఉచిత ఇసుక కోసం స్టాక్ యార్డుల వ‌ద్ద ట్రాక్ట‌ర్లు, లారీలు సోమ‌వారం ఉద‌యం నుంచే బారులు తీరాయి. వాటిని జెసిబిల‌తో లోడింగ్ చేసి త‌ర‌లించారు. ఇసుక సరఫరా కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. డెంకాడ యార్డులో ఉచిత ఇసుక సరఫరా కార్యక్రమాన్ని నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగ మాధవి ప్రారంభించారు.
జిల్లాలో ఇసుక రీచ్‌లు లేక‌పోవ‌డంతో, డెంకాడ మండ‌లం పెద‌తాడివాడ‌, బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌, కొత్త‌వ‌ల‌స వ‌ద్ద ఇసుక స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. కొత్త‌వ‌ల‌స‌లో 11,805 మెట్రిక్ ట‌న్నులు, డెంకాడ‌లో 9,756 మెట్రిక్ ట‌న్నులు, బొబ్బిలిలో 72,466.5 మెట్రిక్ ట‌న్నులు, మొత్తం సుమారు 92వేల ట‌న్నుల‌ ఇసుక ఇప్ప‌టికే నిల్వ సిద్దంగా ఉండ‌టంతో, ఆయా స్టాక్‌యార్డుల‌నుంచి స‌ర‌ఫ‌రా ప్రారంభ‌మ‌య్యింది. జిల్లాలో నాణ్య‌మైన ఇసుక ల‌భించ‌క‌పోవ‌డంతో, శ్రీ‌కాకుళం, మ‌న్యం జిల్లాల నుంచి ఇక్క‌డి స్టాక్ యార్డుల‌కు ఇసుకను రప్పిస్తున్నారు. ఇందుకు అయ్యే రవాణా వ్య‌యం, హేండ్లింగ్ ఛార్జీల‌ క్రింద‌, మెట్రిక్ ట‌న్నుకు రూ.605 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. వినియోగ‌దారులు ఇసుక‌ను తీసుకువెళ్లేందుకు వాహ‌నాల‌ను స్టాక్‌యార్డుకు తీసుకువ‌చ్చి, ర‌వాణా ఛార్జీల‌ను చెల్లించి ఉచితంగా ఇసుక‌ను తీసుకువెళ్లే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది. దీంతో స్టాక్‌యార్డుల‌వ‌ద్ద ఇసుక‌కోసం వాహ‌నాలు బారులు తీరాయి. ఒక వ్య‌క్తికి రోజుకు గ‌రిష్టంగా 20 ట‌న్నుల ఇసుక‌ను మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది. ప్ర‌తిరోజూ ఉద‌యం 6 గంట‌లు నుంచి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు స్టాక్ యార్డుల్లో ఇసుక స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది. తీసుకున్న ఇసుక‌కు త‌ప్ప‌నిస‌రిగా బిల్లు జారీ చేస్తారు. ప్ర‌తీ స్టాక్ యార్డువ‌ద్దా విఆర్ఓ, విఆర్ఏ, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్‌లు ఉండి ఇసుక స‌ర‌ఫ‌రాను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇసుక స‌ర‌ఫ‌రాపై ఫిర్యాదులు స్వీక‌రించేందుకు 24 గంట‌లు ప‌నిచేసే విధంగా 9032338135 నెంబ‌ర్‌తో కాల్‌సెంట‌ర్ అందుబాటులోకి వచ్చింది. (Story: ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా ప్రారంభం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1