టిడిపి-జనసేన సభతో నిరాశలో జగన్
ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదవేగి (న్యూస్ తెలుగు): తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందనీ, లక్షలాదిగా తరలి వచ్చిన టిడిపి జనసేన కార్యకర్తల ఉత్సాహం చూసి వైసిపి అగ్ర నాయకుడు నుంచి కార్యకర్తలు సైతం నిరాశలో కుంగి పోయారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వైఎస్సార్సీపీ దొంగలకు వ్యతిరేకంగా తేదేపా జనసేన పోరాడుతున్నాయనీ, రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, టీడీపీ జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం కాదనీ, 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలిపారని చింతమనేని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమిఇదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలని, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంతాబాబు హత్య చేసి ఆ, మృతదేహాన్ని వారి ఇంటికి డోర్ డెలివరీ చేశారని,
టీడీపీ అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు రూ.5తో భోజనం పెడితే జగన్ రెడ్డి వాటిని మూయించారని చింతమనేని తెలిపారు. కరోనా సమయంలో ఫేస్ మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ ను మానసిక వికలాంగుడిగా ముద్రవేసి చంపారని,
వైఎస్సార్సీపీ వేధింపులు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారి స్వయంగా తప్పుకున్నాడని ఆరోపించారు.
వై నాట్ 175 అంటున్నాడు జగన్ రెడ్డి, ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలో అడుగుతున్నాం, ఆయన ఏం సాధించారనీ వేయాలి అని చింతమనేని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ?, డీఎస్సీ ఎక్కడ?, ఉచిత ఇసుక ఎక్కడ? అని ప్రశ్నించారు. వైనాట్ పులివెందుల అని ప్రజలు అంటున్నారని, పులివెందులలో జగన్ రెడ్డికి ఓటమి తప్పదని , ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు సూపర్ 6ని ప్రవేశపెట్టారని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే బ్లూప్రింట్ టీడీపీ దగ్గర ఉందన్నారు.
జగన్ లాగా ప్రజల సొమ్ము దోచుకోకుండా, సంక్షేమ పథకాలు నిజాయితీ గా అమలు చేస్తామని, సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అవుతుందని, టీడీపీ జనసేన విన్నింగ్ టీమ్ అయితే వైకాపా లూసింగ్ టీమ్ అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. (Story: టిడిపి-జనసేన సభతో నిరాశలో జగన్)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!