పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు
పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి
న్యూస్‌తెలుగు/చింతూరు: పోలవరం జిల్లాలోని 12 మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రెండు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో రాజకీయ, వ్యక్తిగత కక్షలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి చట్టప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టాలన్నారు.
పోలీసు అధికారులు ప్రజలతో మమేకమై, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి- ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.
అలాగే, ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య పండుగ అని, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతుందని, ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి స్పష్టం చేశారు. (Story: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

