Homeవార్తలుశ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆలోకమయ్ కోల్‌కతా’

శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆలోకమయ్ కోల్‌కతా’

శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆలోకమయ్ కోల్‌కతా’, దీపావళి సంబరాలతో నగర ప్రజలను ఒక్కచోట చేర్చిన నాలుగు రోజుల ప్రత్యేక కార్యక్రమం

  • కోల్‌కతా అక్రోపోలిస్ మాల్‌లో జరిగిన ముగింపు వేడుకలకు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి హాజరు

కోల్‌కతా, నవంబర్ 10,  2026: దీపావళి పర్వదినం సందర్భంగా శ్యామ్ మెటాలిక్స్ సంస్థ కోల్‌కతా నగర ప్రజలను నాలుగు రోజులపాటు ఒకచోట చేర్చి ‘ఆలోకమయ్ కోల్‌కతా’ పేరిట ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. నగరంలోని అక్రోపోలిస్ మాల్‌లో నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమం వెలుగులు, రంగులు, కళలు, సంస్కృతిపై ప్రజలకున్న అభిరుచిని ప్రతిబింబించింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రజల భాగస్వామ్యంతో కోల్‌కతా పండుగ వాతావరణాన్ని, కళాత్మక వైభవాన్ని చాటిచెప్పారు. కోల్‌కతాకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును వేడుకల రూపంలో ఆవిష్కరించాలనే లక్ష్యంతో శ్యామ్ మెటాలిక్స్ సంస్థ ‘ఆలోకమయ్ కోల్‌కతా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. సంప్రదాయాలకు సృజనాత్మకత, ఆధునికతను జోడించి సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించింది.

ఈ వేడుకల్లో భాగంగా SEL టైగర్ TMT బార్స్ బలాన్ని, SEL టైగర్ రూఫింగ్ షీట్స్ వైవిధ్యాన్ని చాటిచెప్పే ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. SEL టైగర్ TMT బార్స్‌తో రూపొందించిన ఆకట్టుకునే దీపాల వృక్షం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే SEL టైగర్ రూఫింగ్ షీట్స్‌తో కోల్‌కతా నగర ప్రత్యేకతను ప్రతిబింబించే వారసత్వ ట్రామ్, సంప్రదాయ ట్యాక్సీ నమూనాలను కూడా సృజనాత్మకంగా రూపొందించారు. విద్యుద్దీపాలతో అలంకరించిన తోరణాలు, ఇతర అలంకరణలు ఈ ప్రదర్శనలకు మరింత వన్నె తెచ్చాయి. కోల్‌కతా నగర చారిత్రక ప్రత్యేకతలను, శ్యామ్ మెటాలిక్స్ ఉత్పత్తుల సాంకేతిక సామర్థ్యాన్ని ఈ నిర్మాణాలు చాటిచెప్పాయి. కేవలం అలంకరణలకే పరిమితం కాకుండా, ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమంలో పెద్దపీట వేశారు.

తొలిరోజైన నవంబర్ 6న పూలతో రంగోలి (ఫూలోన్ కీ రంగోలి) కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 7న రంగోలి పోటీలు నిర్వహించారు. నవంబర్ 8న దీపాలంకరణ (దియా పెయింటింగ్) కార్యక్రమం చేపట్టారు. ఈ విభిన్నమైన సృజనాత్మక కార్యక్రమాల ద్వారా సందర్శకులను వేడుకల్లో భాగస్వాములను చేశారు.

వేడుకల చివరి రోజైన నవంబర్ 9న నగరంలోని అక్రోపోలిస్ మాల్‌లోజరిగిన ముగింపు వేడుకలకు

ప్రముఖ నటుడు, సాంస్కృతిక రంగ ప్రముఖుడు మిథున్ చక్రవర్తి  ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి సత్కరించారు. ప్రత్యేక బహుమతులను కూడా ప్రదానం చేశారు. కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా, సమాజంతో మమేకమై ప్రజలను ఒక్కచోట చేర్చే అర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించాలనే లక్ష్యంతో శ్యామ్ మెటాgలిక్స్ ఈ వేడుకలను చేపట్టింది.

ఈ కార్యక్రమం గురించి శ్యామ్ మెటాలిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిర్మల్ ఉదయ్ మాట్లాడుతూ, కోల్‌కతా అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, ప్రజలు, వారి సంప్రదాయాలు, సృజనాత్మకత, అసాధారణమైన ఐక్యతా భావం మేళవించిన ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. ఆలోకమయ్ కోల్‌కతా కార్యక్రమం ద్వారా ఈ ప్రత్యేకతలను వేడుకగా జరుపుకోవడంతోపాటు, నగర ప్రజలు పండుగ సంబరాల్లో అంతర్భాగం కావాలని భావించినట్లు తెలిపారు. తమ సంస్థ సొంతంగా భావించే ఈ కోల్‌కతా నగర స్ఫూర్తితో SEL టైగర్ TMT బార్స్, SEL టైగర్ రూఫింగ్ షీట్స్‌ను సృజనాత్మక రూపాల్లో ఆవిష్కరించడం తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. తమ ఉత్పత్తులతో నిర్మించే కట్టడాలు దృఢమైనవే కాకుండా, ప్రజలు, సమాజంతో ఏర్పరుచుకునే బంధాల్లోనూ నిజమైన దృఢత్వం ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆలోకమయ్ కోల్‌కతా ద్వారా నగరంలో జరిగే దీపావళి వేడుకలకు మరింత వెలుగు, ఆనందం, ఐక్యతను జోడించాలని భావించినట్లు పేర్కొన్నారు. (Story: శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆలోకమయ్ కోల్‌కతా’)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments