Homeవార్తలుకొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి

కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి

కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి

మెక్‌కాన్ ఇండియా రూపొందించిన ఈ ప్రచారం, మలబద్ధకానికి సంబంధించిన కడుపు ఉబ్బరం, ముక్కోవడం, గట్టి మలం వంటి మూడు ప్రధాన సమస్యలకు పరిష్కారంగా కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ అందించే ‘వన్ స్మార్ట్ సొల్యూషన్’ అనే ప్రతిపాదనను ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తుంది.

ముంబై, , 2026: మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్‌సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది. మలబద్ధకం గురించి మరింత బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించడంతో పాటు, ఒక సరళమైన ప్రతిపాదనను ప్రజలకు చేరువ చేసేందుకు హాస్యం, అందరికీ సుపరిచితమైన కార్యాలయ నేపథ్యాన్ని ఉపయోగించింది. మలబద్ధకంతో పాటు దానికి సంబంధించిన మూడు సమస్యలైన కడుపు ఉబ్బరం, ముక్కోవడం, గట్టి మలం వంటి వాటికి ఒకే ఒక తెలివైన పరిష్కారం అనే సందేశాన్ని ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది. ఈ ప్రచారంలో ప్రధాన ఆకర్షణ పంకజ్ త్రిపాఠి నటించిన కొత్త ప్రకటన చిత్రం. తనదైన ఆప్యాయతతో కూడిన నటన, సున్నితమైన హాస్యం ద్వారా త్రిపాఠి కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌ను పరిచయం చేస్తూ, బ్రాండ్‌ #1స్మార్ట్‌సొల్యూషన్ ప్రతిపాదనను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అందించారు.

మలబద్ధకం ఉన్నవారికి ఒక్కోసారి ఒక్కో రకమైన ఇబ్బంది ఎదురవుతుంది. కడుపు ఉబ్బరం, మలవిసర్జన సమయంలో ముక్కోవడం, గట్టిగా ఉన్న మలం వంటి సమస్యల వల్ల సరైన ఉపశమనాన్ని పొందడం కష్టంగా అనిపించవచ్చు. డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌లోని రెండు రకాల శక్తివంతమైన పదార్థాలు ఈ సమస్యల నుంచి సమర్థవంతమైన ఉపశమనం అందించడంలో సహాయపడతాయి. సోంపు రుచితో లభించే ఈ లిక్విడ్ 150 మి.లీ. బాటిల్ ధర రూ. 150* మాత్రమే. సరసమైన ధరలో స్వీయ సంరక్షణ ఉత్పత్తులను మరింత మంది భారతీయులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఒపెల్లా నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ ప్రచారం గురించి, శ్రీమతి నూపుర్ గుర్బక్సాని, బ్రాండ్ & ఇన్నోవేషన్ హెడ్, ఒపెల్లా (ఇండియా) మాట్లాడుతూ, “ప్రతిరోజూ 2.76 కోట్ల మంది భారతీయులు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, వీరిలో మూడింట ఒక వంతు మంది ఈ సమస్యకు ఎప్పుడూ వైద్య సహాయం తీసుకోరు. దాదాపు సగం మంది పెద్దగా ప్రయోజనం లేని ఇంటి చిట్కాలపైనే ఆధారపడుతున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలు, ప్రకటనల్లో మలబద్ధకాన్ని హాస్యంగా చూపిస్తూ, ఈ సమస్యతో బాధపడేవారు ఎదుర్కొనే నిజమైన ఇబ్బందులను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఈ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించడంతోనే మా బాధ్యత ముగియదని మేము భావిస్తున్నాము. మలబద్ధకం గురించి ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించడం కూడా మా బాధ్యతే. డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కొత్త ప్రచారం ద్వారా, ఈ సమస్యతో బాధపడేవారి ఇబ్బందులను హాస్యంగా తీసుకోకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకునేలా, వారితో అనుబంధం ఏర్పడేలా సానుభూతితో ఈ సందేశాన్ని అందిస్తున్నాము,” అని అన్నారు.

హిమాన్షు బక్షి, మేనేజింగ్ డైరెక్టర్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్ మాట్లాడుతూ, “ఒపెల్లాలో, స్వీయ సంరక్షణ అనేది సులభంగా, అందరికీ అందుబాటులో ఉండాలని మేము నమ్ముతాము. అందుకే, రోజువారీ ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన ఉపశమనం పొందడానికి తోడ్పడే డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌ను పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది,” అని అన్నారు.

సక్షమ్ కోహ్లీ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మెక్‌కాన్ ఇండియా మాట్లాడుతూ, “మలబద్ధకం సమస్యను హాస్యంగా చూపించకుండా, దాని గురించి జరిగే సంభాషణను మాత్రం సరదాగా, అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే మా ముందున్న సవాలు. ఈ కథను స్నేహపూర్వకమైన బాస్‌గా నటించిన పంకజ్ త్రిపాఠి, ఆయనతో పనిచేసే ఉద్యోగి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం చుట్టూ రూపొందించాము. పంకజ్ తన సహజమైన ఆప్యాయతతో కథకు సాన్నిహిత్యాన్ని తీసుకువస్తే, ఆ సందర్భం హాస్యాన్ని జోడిస్తుంది. ఈ ప్రచారం వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం: మలబద్ధకం వల్ల అనేక సమస్యలు ఎదురైనప్పుడు, డల్కోఫ్లెక్స్ లిక్విడ్ ఒకే ఒక తెలివైన పరిష్కారాన్ని అందిస్తుంది,” అని అన్నారు. (Story: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments