ఆస్తులు కుమ్ముడే కుమ్ముడు!
బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటి పై ఏసీబీ దాడులు
ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అతిపెద్ద అవినీతి తిమింగలం దొరికింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో భూగర్భజలవనరుల శాఖకు చెందిన మైనింగ్ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన తన అధికారిక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల పై ఏసీబీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను అధికారులు ఇప్పటి వరకు లభించాయి. సోదాల్లో ఇప్పటివరకు రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు పుస్తకాలు, జనగామ జిల్లాలోని 5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా పూర్తి కాకపోవడంతో మొత్తం ఆస్తుల విలువ, ఇతర కీలక పత్రాలు లేదా నగదు, బంగారం తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సోదాలు కొనసాగుతుండటంతో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. (Story: ఆస్తులు కుమ్ముడే కుమ్ముడు!)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
- నవ్వులే నవ్వులు! నయనం టీమ్‌తో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

