వినుకొండ ఎస్సీ హాస్టల్‌లో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షణ
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, బహుమతుల ప్రదానం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు మేళం మధుబాబు ఆదేశాల మేరకు, ఉపాధ్యక్షులు ముట్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏలూరి శశికుమార్, ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మకుటం శివ హాజరై హాస్టల్ విద్యార్థులతో కలిసి ‘మన్ కీ బాత్’ను వీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇచ్చే సందేశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక అంశాలు, దేశాభివృద్ధిపై ప్రధాని పంచుకునే ఆలోచనలను విద్యార్థులు ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సెక్రటరీ జాన్‌బాబు, ఈపూరు ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల బెన్ని, పలువురు హాస్టల్ విద్యార్థులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వినుకొండ ఎస్సీ హాస్టల్‌లో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షణ )

